Advertisementt

దెబ్బకి దెయ్యం దిగిందా.. రాజా..!

Tue 14th Feb 2017 12:17 PM
ravi teja,producers,directors,remuneration  దెబ్బకి దెయ్యం దిగిందా.. రాజా..!
దెబ్బకి దెయ్యం దిగిందా.. రాజా..!
Advertisement
Ads by CJ

రవితేజ సినిమాలు చెయ్యడానికి బాగా గ్యాప్ తీసుకుంటున్నాడు. మరి రవితేజ ఈ గ్యాప్ తీసుకున్నాడో? లేక మరేదైనా కారణమో తెలియదు గాని ఏకంగా మొహానికి రంగు వేసుకోకుండా ఏడాది పైనే ఉండి పోయాడు. అయితే ఆ ఆలస్యానికి కారణమేదో కాదని అది కేవలం రవితేజ తన రెమ్యునరేషన్ అమాంతంగా పెంచడంతోనే నిర్మాతలు రవితేజని పక్కకి పెట్టినట్లు వార్తలొచ్చాయి. అయితే అవన్నీ అలా ప్రచారం జరుగుతున్న టైములో ఒకేసారి రవితేజ రెండు సినిమాలను ఓపెనింగ్ చేసుకుని ఒకింత ఆశ్చర్యానికి గురిచేశాడు. 

అయితే ఒకేసారి రెండు సినిమాలను లైన్లోకి పెట్టాడడానికి కారణం కూడా చెప్పేస్తున్నారు కొంతమంది . ఆ కారణమేమిటంటే రవితేజ తన రెమ్యునరేషన్ ని తగ్గించడమే అని అంటున్నారు. రెమ్యునరేషన్ ని బాగా పెంచడం వలెనే తనకి నిర్మాతలు దూరమయ్యారని తనతో సినిమాలు చెయ్యడాయికి ఎవరూ ఆశక్తి చూపడం లేదని అర్ధమయ్యే.... ఇలా తన రేటు తగ్గించాడనే గుసగుసలు వినబడుతున్నాయి. అంతేకాకుండా సినిమాలకు లాభాలు వస్తే ఆ లాభాల్లో 25  శాతం వాటా తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నాడనే టాక్ కూడా బయలు దేరింది.  అలా రవితేజ చెప్పాడో లేదో అప్పుడే నిర్మాతలు రవితేజ గుమ్మం దగ్గర ప్రత్యక్షమయ్యారనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా రవితేజకి ఒక ఏడాది తిరిగేలోపు ఎక్కిన దెయ్యం కాస్తా దెబ్బకి దిగిందనే కామెంట్స్ వినబడుతున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ