ఇప్పుడు మెగాఫ్యామిలీలో దాదాపు అరడజనుకు పైగా హీరోలున్నారు. వీరి చిత్రాలు వీరికే పోటీ కాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. కనీసం ఒకరికి ఒకరు నెలరోజుల వ్యవధినైనా తీసుకుంటేనే మేలు. ఇక ఈనెల 24న సాయిధరమ్‌తేజ్ నటిస్తోన్న 'విన్నర్' విడుదలకు సిద్దమవుతోంది. దానికి నెలకు పైగా గ్యాప్‌లో పవన్ 'కాటమరాయుడు' గా వస్తున్నాడు. మార్చి29న పవన్ చిత్రం రిలీజ్ అవుతున్న సమయంలో ఓ పదిరోజుల గ్యాప్‌లో మరో మెగాహీరో వరుణ్‌తేజ్ నటించనున్న 'మిష్టర్' విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. దీనిని ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కానీ 'కాటమరాయుడు' పెద్ద హిట్ అయిన పక్షంలో 'మిష్టర్'కి తిప్పలు తప్పవు. పోనీ ఏప్రిల్ మూడు, నాలుగు వారాల్లో వెళ్లాలంటే మరో గుదిబండ 'బాహుబలి2' అందరినీ టెన్షన్ పెడుతోంది.
మేలో రావాలంటే బన్నీ 'డిజె'తో సిద్దంగా ఉన్నాడు. మరి 'మిష్టర్' చిత్రానికి సరైన రిలీజ్ డేట్ ఎప్పుడు లభించనుందనేది ఆసక్తికరంగా మారింది. 'లోఫర్' వంటి డిజాస్టర్ చవిచూసిన వరుణ్‌తేజ్‌కు ఈ చిత్రం అత్యంత కీలకం. మరోపక్క 'ఆగడు, బ్రూస్‌లీ' వంటి డిజాస్టర్స్ తర్వాత ఇది శ్రీనువైట్ల చేస్తున్న చిత్రం. దీంతో ఆయన కెరీర్‌కు కూడా 'మిష్టర్' లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లమ్ అయింది. అందునా చాలాకాలం తర్వత తన రొటీన్ పంధాని విడిచిపెట్టి ఓ లవ్ ఎంటర్‌టైనర్‌తో శ్రీనువైట్ల వస్తున్నాడు. ఇది కేవలం ప్లానింగ్ లేకపోవడం వల్ల జరిగిన తప్పుగా పరిగణించలేం. ఎందుకంటే షూటింగ్‌లో వరుణ్‌తేజ్ తీవ్రంగా గాయపడి బెడ్‌రెస్ట్ తీసుకోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతోంది. మరి 'మిష్టర్' విషయంలో దర్శకనిర్మాతలు, మెగాకాంపౌండ్ ఎలా ఆలోచించి, నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సివుంది.....!