Advertisementt

అల్లు చిత్రం టైటిల్ కొంచెం వెరైటీగా లేదూ..!

Mon 13th Feb 2017 03:21 PM
allu arjun,director haris shankar,dj movie,allu arjun nex movie,director okkantham vamsi,naa name surya naa house india movie  అల్లు చిత్రం టైటిల్ కొంచెం వెరైటీగా లేదూ..!
అల్లు చిత్రం టైటిల్ కొంచెం వెరైటీగా లేదూ..!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డీజే ఫస్ట్ లుక్ ని  చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. డీజే ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ ఫేస్ ని అయితే చూపెట్టలేదుగాని ఆ పోస్టర్ మాత్రం ప్రేక్షకులని ఆకట్టుకునేలా వుంది. ఇక అల్లు అర్జున్ డీజే చిత్రం పూర్తికాగానే లింగుస్వామి డైరెక్షన్ లో బైలింగ్యువల్ మూవీలో నటించాల్సి ఉంది. అయితే ఈ చిత్రం పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది గాని ఇప్పటివరకు సెట్స్ మీదకైతే వెళ్ళలేదు. అదలా ఉండగా  ఇప్పుడు బన్నీ మరో ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. 

అల్లు అర్జున్ కి రైటర్ వక్కంతం వంశి చెప్పిన కథ నచ్చడంతో వంశీ డైరెక్షన్లో నటించడానికి బన్నీ రెడీ అయ్యాడు. వంశీ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఒక చిత్రం చెయ్యడానికి అల్ల అర్జున్ సుముఖత చూపిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ నిర్మించనున్నాడు. ఇంకా పట్టాలెక్కని ఈ చిత్రానికి టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక వెరైటీ టైటిల్ హల్ చల్ చేస్తుంది. అయితే ఈ టైటిల్ ని వక్కంతం వంశీ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రానికే రిజిస్టర్ చేయించారని చెబుతున్నారు. ఇక వంశీ రిజిస్టర్ చేయించి ఆ టైటిల్ ఏమిటి అనుకుంటున్నారా.... 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' అనే టైటిల్ ని వక్కంత రిజిస్టర్ చేయించినట్లు వార్తలొస్తున్నాయి.

అయితే ఈ 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'  టైటిల్ కాస్త కొత్తగా అనిపించినా తొందరగానే  ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారని అంటున్నారు. ఇప్పటికే బన్నీ 'సన్ ఆఫ్ సత్య మూర్తి, దువ్వాడ జగన్నాధం' వంటి వెరైటీ టైటిల్స్ ని చూస్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వంశీ రిజిస్టర్ చేయించిన 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'  టైటిల్ కి కూడా బన్నీ ఏం అభ్యంతరం చెప్పకపోవచ్చనే కామెంట్స్ వినబడుతున్నాయి. మరి బన్నీ లింగుస్వామి చిత్రాన్ని, వంశీ చిత్రాన్ని ఒకేసారి లైన్ లో పెడతాడో? లేక ఒకదాని తర్వాత ఒకటి సెట్స్ మీదకి తీసుకెళ్తాడో?చూద్దాం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ