పలు దఫాలుగా వాయిదా వేసి రిలీజ్ చేసిన 'విన్నర్' సినిమా ట్రైలర్ పై పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. పక్కా మాస్, కమర్షియల్ సినిమా అని తెలుస్తోంది. హీరో సాయిధరమ్ తేజ్ ను చూస్తుంటే కొన్ని యాంగిల్స్ లో రామ్ లాగా, కల్యాణ్ రామ్ లాగా కనిపిస్తున్నాడని, ఆయన హెయిర్ స్టైల్ మార్చడం వల్ల ఈ సమస్య ఏర్పడిందనే మాట వినిపిస్తోంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో కనిపించిన లుక్ ను పూర్తిగా మార్చేశారు. ఈ మార్పు అభిమానులను ఇబ్బంది పెడుతోంది. ఇక ట్రైలర్ లో గుర్రంపై స్వారీ చేయడం హైలెట్. దర్శకుడు గోపీచంద్ ఇంకా పాత వాసన వదిలించుకున్నట్టు లేదు. గుర్రంపై ఛేజ్ చేసే రోజులా ఇవి!!.
గతంలో చిరంజీవి సక్సెస్ సినిమాల ఫార్మెట్ ను ఫాలో అయినట్టు కనిపిస్తోంది. 'విన్నర్' ప్రేక్షకుల్లో ఏ మేరకు విజేత అవుతాడనేది వేచి చూడాలి.