మహేష్ బాబు - వెంకటేష్, వెంకటేష్ - పవన్ కళ్యాణ్, నాగార్జున- విష్ణు లు చేస్తేనే మల్టీ స్టార్రర్ చిత్రాలా... మేము చేస్తే మల్టీ స్టార్రర్ కదా... అంటూ కుర్ర హీరోలు కూడా మల్టీ స్టార్రర్ చిత్రం చెయ్యడానికి ముందుకు వచ్చారు. కేవలం ఇద్దరు యాంగ్ హీరోలతోనే ఈ మల్టీ స్టార్రర్ చిత్రం తెరకెక్కడంలేదు. టాలీవడ్ లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని మినిమమ్ గ్యారెంటీ హీరోలుగా పేరుతెచ్చుకుంటున్న నలుగురు కుర్ర హీరోలు కలిపి ఈ మల్టీ స్టార్రర్ చిత్రం చేస్తున్నారు. వారిలో 'సోలో, జ్యో అచుతానంద, ప్రతినిథి' వంటి డిఫరెంట్ మూవీస్ తో దూసుకుపోతున్న నారా రోహిత్, 'వెంకటాద్రి ఎక్సప్రెస్స్' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సందీప్ కిషన్, 'లవ్ లీ, చుట్టాలబ్బాయి' వంటి చిత్రాలతో తానేమిటో నిరూపించుకున్న ఆది, 'ప్రేమ కథ చిత్రం, భలే మంచి రోజు'తో హీరో గా ప్రూవ్ చేసుకున్న సుధీర్ బాబులు కలిసి ఒకే చిత్రంలో కనిపించనున్నారు.
ఇక ఈ చిన్న మల్టీ స్టార్రర్ చిత్రం ఈ రోజు ఉదయమే పూజ కార్యక్రమాలతో మొదలైంది. ఈ పూజ కార్యక్రమానికి రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ శ్రీను వైట్ల విచ్చేసి హీరోలందరికీ ఈ సినిమా సక్సెస్ సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. మరి పెద్ద హీరోలెవరైనా ఇద్దరు కలిసి నటిస్తున్నారు అంటే ఆ చిత్రానికి యమా క్రేజ్ ఉంటుంది. అంచనాలు కూడా భారీ స్థాయిలో ఉంటాయి. మరి ఇప్పుడు నలుగురు చిన్న హీరోలు కలిసి నటించే ఈ బుల్లి మల్టీ స్టార్రర్ చిత్రంపై ఎన్ని అంచనాలుంటాయో అనేది ప్రస్తుతానికి సస్పెన్సు. కేవలం బడా హీరోలే మల్టీ స్టార్రర్ చిత్రాలు చెయ్యడానికి పెద్దగా మొగ్గు చూడం లేదు. మరి యంగ్ హీరోలను చూసి అయినా కొంతమందిలో మార్పు వస్తే ఇండస్ట్రీకి చాలా మేలు జరుగుతుందని సినీరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.