చాలాకాలం తర్వాత ప్రభాస్‌కు, ఆయన ఫ్యాన్స్‌కు ప్రత్యర్ధుల విమర్శలకు చెక్‌పెట్టే సమయం ఆసన్నమైంది. 'మిర్చి'తో ప్రభాస్ తన కెరీర్‌లోనే పెద్ద హిట్ సాదించాడు. ఇక ఆ తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో చేసిన 'బాహుబలి1' ద్వారా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో స్టార్‌గా మారిపోయాడు. ఆయనకున్న క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ చిత్రం సంచలన కలెక్షన్లు సాధించింది. ఇక ఏప్రిల్ 28న ఆయన నటించిన 'బాహుబలి2' విడుదలకు సిద్దమవుతోంది.
ఈ చిత్రం కూడా రికార్డులను బద్దలుకొట్టడం ఖాయమంటున్నారు. కానీ కొందరు మాత్రం 'బాహుబలి' చిత్రం ప్రత్యేకమైనదిగా భావించి, 'బాహుబలి', నాన్ బాహుబలి అనే వాదనలకు తెరతీశారు. ఈ చిత్రం రెండు పార్ట్‌లకు అసలైనహీరో రాజమౌళినే అని కొత్త లెక్కలు చెబుతున్నారు. తన కెరీర్‌లో 'బాహుబలి' మినహా మరే చిత్రం కూడా కనీసం 50కోట్లను కూడా దాటలేకపోయిన విషయాన్ని యాంటీ ఫ్యాన్స్ అస్త్రంగా వాడుకుంటున్నారు. సో.. ప్రభాస్ స్టామినా ఏమిటో అందరికీ తెలియాలంటే 'బాహుబలి' రెండు భాగాల తర్వాత ఆయన చేయబోయే చిత్రం సాధించబోయే కలెక్షన్ల మీదనే ఆధారపడివుంది. ఇక తన మొదటి చిత్రం 'రన్‌రాజారన్'తో అందరినీ మెప్పించిన యువదర్శకుడు సుజీత్‌కు ప్రభాస్ 'బాహుబలి' తర్వాత పెద్ద బాధ్యతను అప్పగించి, అందరినీ ఆశ్యర్యపరిచాడు. కేవలం ఒకే ఒక్క చిత్రం తీసిన సుజీత్‌కు యంగ్‌రెబెల్‌స్టార్ చాన్స్ ఇవ్వడం, ఈ చిత్రాన్ని తన సొంతబేనర్‌లాంటి యువిక్రియేషన్స్‌లో ప్రభాస్ చేయడం, ఈ చిత్రం కూడా కేవలం తెలుగులోనే కాక తమిళ్, హిందీ భాషల్లో రూపొందనుండటం ప్రత్యేకంగా నిలుస్తాయి.
ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్రని చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. 'బాహుబలి' చిత్రం కోసం ప్రభాస్ వెచ్చించినంత కాలాన్ని సుజీత్ కూడా తన స్టోరీని మరింత మెరుగులు దిద్దేందుకు తీసుకున్నాడు. ప్రస్తుతం 'బాహుబలి2' షూటింగ్‌ను కూడా ప్రభాస్ పూర్తిచేయడంతో ఆయన సుజీత్‌తో చేయబోయే చిత్రానికి లాంఛనంగా రేపు ముహూర్తం నిర్ణయించారు. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్యమైన అతిథులు హాజరుకానున్నారు. మరి ఈ చిత్రం ఎప్పటి నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించుకోనుందో రేపు తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి ఈ చిత్రం ప్రభాస్‌కు, సుజీత్‌కు, ప్రభాస్ అభిమానులకు మాత్రం అగ్నిపరీక్షేనని చెప్పాలి.