Advertisementt

ఆల్‌రౌండర్‌ అనిపించుకుంటున్నాడు..!

Mon 13th Feb 2017 09:27 AM
bollywood hero,akshay kumar,all rounder in movies,robo 2.0,rajinikanth  ఆల్‌రౌండర్‌ అనిపించుకుంటున్నాడు..!
ఆల్‌రౌండర్‌ అనిపించుకుంటున్నాడు..!
Advertisement
Ads by CJ

మిగిలిన స్టార్‌ హీరోలు ఏడాదికి ఒక్క చిత్రం చేయడానికే తంటాలు పడుతుంటే ఏడాదికి నాలుగైదు చిత్రాలను ఆడుతూపాడుతూ చేసే బాలీవుడ్‌ ఖిలాడీ స్టార్‌ అక్షయ్‌కుమార్‌. దాంతో ఆయనకు బాలీవుడ్‌లో మినిమం గ్యారంటీ స్టార్‌ అనే పేరొచ్చింది. నటుడంటే కుండలు తయారు చేసే మట్టిలాంటి వాడు. ఆ మట్టిని మలుచుకుంటే ఎలాగైనా మారుతుంది. అలాగే నటుడు నీళ్ల వంటి వాడు. ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలో ఒదిగిపోవాలి. ఇది అక్షయ్‌కి అక్షరాలా వర్తిస్తుంది. 

ఉదాహరణకు కిందటి ఏడాది ఆయన నటించిన చిత్రాలను చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. గతేడాది ఆయన నటించిన 'ఎయిర్‌లిఫ్ట్‌' చిత్రం విభిన్న ప్రయోగం. 'హౌస్‌ఫుల్‌3' చిత్రం కామెడీ ఎంటర్‌టైనర్‌. 'రుస్తుమ్‌' చిత్రం 1959లో జరిగిన ఓ వాస్తవిక ఘటనకు తెరరూపం. ఈ చిత్రాలన్నీ వందకోట్లను ఈజీగా అందుకుని ఆయన నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి. ఇక ఈ కొత్త ఏడాదిని కూడా ఆయన విజయవంతంగా ప్రారంభించాడు. ఆయన హీరోగా నటించిన 'జాలీ ఎల్‌.ఎల్‌.బి.2' చిత్రం ఇటీవల విడుదలైంది. ఇందులో పోలీస్‌ వ్యవస్థపై, న్యాయవ్యవస్థలపై వ్యంగ్యాస్త్రాలను వదిలారు. సీరియస్‌గా కనిపించే లాయర్‌ పాత్రలో అక్షయ్‌ జీవించాడు. 

మొదటి భాగంలో డబ్బు కోసం కక్కుర్తిపడే లాయర్‌గా, సెకండాఫ్‌లో సిన్సియర్‌ లాయర్‌గా ఆయన నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ చిత్రానికి మంచి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. మొదటి రోజు ఈ మూవీ 20కోట్లు వసూలు చేసింది. ఇది కూడా 100కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమంటున్నారు. ఈ చిత్రాన్ని కొందరు సీనియర్‌ టాలీవుడ్‌, కోలీవుడ్‌ స్టార్స్‌ తమ భాషలలో రీమేక్‌ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. అక్షయ్‌ శంకర్‌ దర్శకత్వంలో రజనీ హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక భారీ చిత్రం '2.౦'లో విలన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతమంది స్టార్స్‌కి ఇంతటి ధైర్యం, తెగువ ఉంటాయో అని ఆయనను చూసిన వారు అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ