Advertisementt

ఓల్డ్ ఇస్ గోల్డ్ లాగా ఇరగదీశారు..!

Sun 12th Feb 2017 01:33 PM
nagarjuna,balakrishna,chiranjeevi,khaidi no 150,gpsk,om namo venkatesaya movie  ఓల్డ్ ఇస్ గోల్డ్ లాగా ఇరగదీశారు..!
ఓల్డ్ ఇస్ గోల్డ్ లాగా ఇరగదీశారు..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సీనియర్ హీరోస్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలు ఈ 2017లో తమ చిత్రాలను విడుదల చేసి హిట్స్ కొట్టేసారు. ఈ 2017 వాళ్లకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్  150' తో మర్చిపోలేని విజయాన్ని అందుకుని ఖుషీగా వున్నాడు. ఇక బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుని పండగ చేసుకునున్నాడు. ఇక నాగార్జున నిన్న విడుదలైన 'ఓం నమో వెంకటేశాయ' తో భక్తిరస విజయంతో ఆనందంలో మునిగిపోయాడు. ఈ ముగ్గురు స్టార్స్ కూడా మూడు విభిన్న కథా చిత్రాలలో నటించి సక్సెస్ సాధించారు.

మరి నాలుగు సీనియర్ హీరోస్ లో ఒకడైన హీరో వెంకటేష్ ఇంకా తన సినిమాని ఈ ఏడాదిలో విడుదల చెయ్యలేదు. వెంకటేష్ తాజా గా నటిస్తున్న 'గురు' చిత్రం ఈ వేసవి సెలవుల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మరి ముగ్గురు సీనియర్ స్టార్స్ వరసబెట్టి సక్సెస్ సాధించి తమ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి అప్పుడే ఆలోచనలు మొదలెట్టేసారు. ఇక మిగిలిన వెంకటేష్ కూడా తన 'గురు' చిత్రాన్ని విడుదల చేసాక తన తదుపరి ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే పనిలో వున్నాడు. మరి ఆ ముగ్గురు స్టార్స్ లాగే వెంకీ 'గురు' కూడా మంచి హిట్ సాధించాలని కోరుకుందాం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ