మెగాస్టార్ చిరంజీవి అభిమానులు చేసిన పెద్ద ప్రయత్నం 'మెగా 150 బాస్ ఇన్ గేమ్'. ముగ్గురు యువకులకు చిరంజీవి గేమ్ చేయాలనే ఆలోచన కలిగింది. సొంత డబ్బుతో ప్రయత్నం చేశారు. యాప్ క్రియేట్ చేశారు. దానిపేరే 'మెగా 150 బాస్ ఇన్ గేమ్'. గూగుల్ ప్లే నుండి దీన్ని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికీ లక్షకు పైగా డౌన్ లోడ్స్ అయ్యాయి. రేటింగ్ లో 4.6 ఉంది. గేమ్ స్పీడ్ గా ఉందనే కామెంట్స్ ఉన్నప్పటికీ, ఆదరణ మాత్రం ఉంది.
ఇలాంటి అరుదైన గేమ్ ను క్రియేట్ చేసిన యువకులకు మాత్రం చిరంజీవి నుండి ఎలాంటి అభినందన అందకపోవడం గమనార్హం. దీన్ని ప్రమోట్ చేయడానికి మెగా కుటుంబ హీరోలెవరూ ముందుకురాలేదు. అభిమానులు చేసిన ప్రయత్నాన్ని ప్రోత్సహించాల్సిన కనీస బాధ్యతని సైతం మర్చిపోయారు. గేమ్ వల్ల వాటి తయారిదారులకు కూడా ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేదు. సొంత డబ్బు (సుమారు 13 లక్షలు) ఖర్చు పెట్టి చేశారు. కేవలం క్రియేటర్స్ గా తమ టాలెంట్ ప్రపంచానికి తెలియజేయడానికి, తద్వారా చిరంజీవిపై తమకున్న అభిమానాన్ని చాటుకోవడానికి చేసిన ప్రయత్నమిది. 'బాస్ ఇన్ గేమ్' అని సగర్వంగా చాటిన అభిమానుల ప్రయోగానికి మెగా కుటుంబం నుండి సపోర్ట్ దొరికితే మరింత మందికి చేరువవుతుంది.
ప్రతి దాన్ని కమర్షియల్ గా ఆలోచించే మెగా వర్గం, ఇందులో కూడా ప్రయోజనాలను ఆశించే సపోర్ట్ ఇవ్వలేదా ? అనే అనుమానం కలుగుతోంది. మాకేంటి అనే ధోరణి సరికాదు. ఒక అగ్రనటుడితో గేమ్ రూపొందించడం అంటే దానిని గర్వంగా చెప్పుకోవాలి.