Advertisementt

కొడుకు కూడా కొబ్బరికాయ కొట్టేసాడు!

Sat 11th Feb 2017 03:09 PM
young tiger ntr,kalyan ram,vv vinayak,rakul preet singh,nivetha thamass,director bobby  కొడుకు కూడా కొబ్బరికాయ కొట్టేసాడు!
కొడుకు కూడా కొబ్బరికాయ కొట్టేసాడు!
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 27వ చిత్రాన్ని ఈ రోజు ఉదయమే పూజ కార్యక్రమాలతో ప్రారంభించేసాడు. బాబీ డైరెక్షన్ లో తన అన్నకళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రంలో ఎన్టీఆర్ త్రిబుల్ రోల్ చెయ్యబోతున్నాడు. 'జనతా గ్యారేజ్' చిత్రం హిట్ అయిన ఆరునెలల తర్వాత ఎన్టీఆర్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ఇక ఈ రోజు ఉదయమే తన తండ్రి హరికృష్ణ, తన అన్న కళ్యాణ్ రామ్ ఆధ్వర్యంలో నిరాడంభరంగా తన కొత్త సినిమాని ప్రారంభోత్సవం చేసేసాడు ఎన్టీఆర్. ఇక ఈ కార్య క్రమానికి తన కొడుకు అభయ్ రామ్ కూడా విచ్చేసి తన తండ్రి సినిమా విజయవంతం కావాలని దేవుడికి కొబ్బరికాయ కూడా కొట్టేసాడు. హరికృష్ణ తన చేతులతో మనవడిని పట్టుకుని మరీ కొబ్బరికాయ కొట్టించాడు. ఇంకా ఈ కార్యక్రమానికి డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ 27వ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఎన్టీఆర్ కి జోడిగా ఇద్దరు హీరోయిన్స్ రాశి ఖన్నా, నివేత థామస్ లు ఎంపికై నట్లు వార్తలొస్తున్నాయి. మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 15  నుండి మొదలు పెట్టుకోనుందని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ