Advertisementt

అసలు ఈ కాంబినేషన్స్ పట్టాలెక్కుతాయా..!

Sat 11th Feb 2017 02:16 PM
chiranjeevi,nagarjuna,venkatesh,subbarami reddy,balakrishna,ntr  అసలు ఈ కాంబినేషన్స్ పట్టాలెక్కుతాయా..!
అసలు ఈ కాంబినేషన్స్ పట్టాలెక్కుతాయా..!
Advertisement
Ads by CJ

గత పది రోజుల నుండి మీడియాకి చిత్ర  పరిశ్రమ నుండి ఫుల్ మీల్స్ లాంటి వార్తలు అందుతున్నాయి. ఇక ఆ న్యూస్ ని గోరంతలు కొండంతలు చేసి మరీ చూపించేస్తుంది  మీడియా. ఒక పక్కన చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలయికలో  మెగా మల్టి స్టారర్ అంటూ పుబ్లిసిటీకి పడిచచ్చే సుబ్బరామిరెడ్డి ప్రకటించాడు. మరో వైపు బాలకృష్ణ తన తండ్రి జీవిత చరిత్రని సినిమా తీస్తాని ప్రకటనలు చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ బయో పిక్ అని ప్రకటన రాగానే పొలిటికల్ నుండి ఫ్యామిలీ వరకు అందరూ భుజాలు తడుముకుంటున్నారు. 

ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు 'ఓం నమో వెంకటేశాయ'తో సూపర్ హిట్ కొట్టిన నాగ్ కూడా మల్టి స్టారర్ చిత్రం చెయ్యడానికి సై అంటున్నాడు. ఓం నమో వెంకటేశాయ పబ్లిసిటీలో భాగంగా ఆయన మాట్లాడుతూ తాను తప్పక మల్టి స్టారర్ చిత్రంలో నటిస్తానని అంటున్నాడు. అది చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో కలిసి చేస్తానని చెబుతున్నాడు. మరి నాగ్ చెప్పినట్లు సీనియర్ హీరోల మల్టీస్టారర్ స్టార్ట్ అసలు అవ్వకముందే ఆ చిత్రానికి పదింతలు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ గనక ఒప్పుకుంటే మల్టి స్టారర్ చేస్తానని నాగార్జున చెబుతున్నాడు. మరి వాళ్ళు ఒప్పుకుంటారా? లేదా అనేది కూడా తెలియాలి గదా.

మరి మనం పైన చూసిన చిత్రాలు గనక నిజంగా సెట్స్ మీదకెళితే టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా బాలీవుడ్ ని తలదన్నే కలెక్షన్స్ రాబట్టడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ