Advertisementt

మళ్లీ నోరెత్తకుండా చేసింది..!

Sat 11th Feb 2017 12:51 PM
anchor anasuya,winner movie,saidharam tej,item song,budda vigraham  మళ్లీ నోరెత్తకుండా చేసింది..!
మళ్లీ నోరెత్తకుండా చేసింది..!
Advertisement
Ads by CJ

అనసూయ యాంకరింగ్ లోనే గ్లామర్ డోస్ పెంచేసి వెండితెరమీద తన హవా కొనసాగించడానికి అన్ని రకాల ప్రయత్నాలు మొదలు పెట్టింది. 'సోగ్గాడే చిన్ని నాయన' లో ఒక పాటలో మెరిసిన అనసూయ 'క్షణం' చిత్రంలో నెగెటివ్ రోల్ లో ఆకట్టుకుంది. అయితే అలాంటి రోల్ కాకుండా హీరోయిన్ రేంజ్ రోల్స్ కోసం అనసూయ బాగానే కష్టపడింది. రకరకాల ఫోటో షూట్స్ తో రెచ్చగొట్టి సాయిధరమ్ తేజ్ 'విన్నర్' లో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ ఐటెంలో అనసూయ ఏ విధంగా రెచ్చిపోయిందో ఆ సాంగ్ మేకింగ్ చూస్తుంటే తెలిసిపోతుంది. ఆ సాంగ్ లో అనసూయ అందాల ఆరబోతతో డాన్స్ కూడా ఇరగదీసిందని చిత్ర యూనిట్ చెబుతుంది.

ఇక ఆ సాంగ్ లో అనసూయ డాన్స్ మీద ఇప్పుడు ఒక కొత్త రకం వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఉక్రెయిన్ లోని బుద్ధ బార్ అనే పబ్ లో తీసిన డాన్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. బుద్ధుని విగ్రహం వద్ద అనసూయ డాన్స్ వేయడంపై నెటిజెన్స్ తీవ్రంగా తప్పుడుతున్నారు. మితిమీరిన అందాల ప్రదర్శనతో అలా బుద్ధుని విగ్రహం వద్ద అనసూయ అసభ్యకరమైన డాన్స్ చెయ్యడం ఏమిటనే కామెంట్స్ ని పడేస్తున్నారు. అయితే వారి విమర్శనలకు స్పందించిన అనసూయ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.

అసలు ఆ బుద్దిని విగ్రహం వద్ద అందరూ మందు కొడతారని.... పార్టీలు అవి అక్కడే చేసుకుంటారని వాళ్లకి లేని తప్పు అక్కడ మేము డాన్స్ చెయ్యడం వల్ల వచ్చిందా... అని గట్టిగా స్పందించింది. తామేమి తప్పు చెయ్యలేదని అక్కడ డాన్స్ చెయ్యడం ఏమి నేరం కాదని.... తనని విమర్శించిన వారికీ బుద్దొచ్చేలా రిప్లై ఇచ్చింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ