Advertisementt

ఎన్టీఆర్ గురించి బాబికి... కోన సలహా..!

Fri 10th Feb 2017 05:28 PM
director bobby,director kona venkat,junior ntr,producer kalyan ram,jai lava kusha movie  ఎన్టీఆర్ గురించి బాబికి... కోన సలహా..!
ఎన్టీఆర్ గురించి బాబికి... కోన సలహా..!
Advertisement
Ads by CJ

దర్శకుడు బాబి అంటే సీనియర్‌ రచయిత, ఘోస్ట్‌ డైరెక్టర్‌, నిర్మాత అయిన కోనవెంకట్‌కు చాలా ఇష్టం. ఒకవిధంగా బాబి ఆయనకు శిష్యుడే. 'పవర్‌' చిత్రానికి దర్శకత్వం అవకాశం ఇప్పిండమే కాదు.. సంపత్‌నంది పనితనం మీద పవన్‌ కాస్త అసంతృప్తితో ఉన్నప్పుడు పవన్‌ కి 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' చిత్రానికి దర్శకునిగా బాబిని కోననే రికమెండ్‌ చేసి ఇప్పించాడని కూడా ఇండస్ట్రీలో టాక్‌ ఉంది. కాగా ఈ రోజు ఎన్టీఆర్‌ హీరోగా నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా ఎన్టీఆర్‌ నటించే 27వ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుంది. దీనికి బాబి దర్శకుడన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం ప్రారంభోత్సవానికి ముందుగా కోనవెంకట్‌ బాబికి విలువైన సలహాలిచ్చాడు. 

'నీ చేతిలో ఎన్టీఆర్‌ అనే అరుదైన వజ్రం ఉంది. దానిని సరిగా ఉపయోగించుకో... నీవు ఎన్టీఆర్‌ను అద్భుతంగా చూపిస్తావనే నమ్మకం నాకుంది. ఆల్‌ ది బెస్ట్‌ అంటూ బాబికి సూచనలను, శుభాకాంక్షలను అందించాడు కోన. ఇక బాబి ట్వీట్‌ చేస్తూ నందమూరి బ్రదర్స్‌ను బాగా ప్రశంసలలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. బాబి తన ట్వీట్స్‌లో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ను సైతం ఆకాశానికి ఎత్తేశాడు. రాకింగ్‌ స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌తో మ్యూజికల్‌ సిట్టింగ్స్‌ అద్భుతంగా జరిగాయి. అద్భుతమైన ట్యూన్స్‌ని అందించినందుకు థ్యాంక్స్‌... ఈ పాటలు ప్రేక్షకులకు కొత్త థ్రిల్‌ని కలిపిస్తాయని అంటూ తాను ఎన్టీఆర్‌, దేవిశ్రీలతో తీయించుకున్న ఫోటోను పోస్ట్‌ చేశాడు. ఇక 'నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌'ల తర్వాత దేవిశ్రీ-ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం హ్యాట్రిక్‌ విజయాన్ని సాధిస్తుందని ఆందరూ ఆశిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ