తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో నటిస్తున్నప్పటికీ ప్రతి హీరోయిన్ చివరి టార్గెట్ బాలీవుడేనని చెప్పాలి. కాగా నాలుగైదేళ్ల కిందట టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన తాప్సికి అందం, టాలెంట్‌తో పాటు గ్లామర్‌షోకి కూడా సిద్దపడినా ఆమెకు దక్షిణాది అసలు కలిసిరాలేదు. దాంతో ఈ భామకు ఐరన్‌లెగ్ అనే బిరుదును మనవారు ఇచ్చారు. కానీ ఆమె నిరుత్సాహపడకుండా బాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ ఆమె నటించిన మూడు చిత్రాలు పెద్ద విజయాలు సాదించాయి.
ముఖ్యంగా 'బేబి, పింక్' చిత్రాలు ఆమెకు మంచి బ్రేక్‌నిచ్చాయి. 'బేబి'లో ఆమె షబానా పాత్రతో మెప్పించగా, 'పింక్' చిత్రంలో అమితాబ్‌తో పోటీపడి నటించిందని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాంతో ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను చిత్రాలున్నాయి. రానాతో కలిసి నటిస్తున్న 'ఘాజీ'లో ఆమె నటించింది. ఈ చిత్రం ఈనెల 17న విడుదల కానుంది. చాలా కాలంగా విడుదలకు నోచుకోని 'రన్నింగ్ షాదీ డాట్‌కామ్' చిత్రంలో త్వరలో విడుదల కానుంది.
ఇక 'బేబి' లోని ఆమె నటించిన షబానా క్యారెక్టర్ ప్రేరణతో రూపొందుతున్న 'నామ్ షబానా' చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. తెలుగు 'హలో బ్రదర్'కి హిందీలో రీమేక్ అయిన 'జుడ్వా' చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతోంది. ఇందులో తాప్సి ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే తెలుగులో వచ్చిన 'ఉలవచారు బిర్యాని' చిత్రం హిందీ రీమేక్‌లో నటిస్తోంది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాలన్నీ ఇదే ఏడాది విడుదలకు సిద్దమవుతుండటంతో పాటు ఈ మూవీలన్నింటిలో తాప్సిది ప్రాధాన్యం ఉన్న పాత్రలే కావడం విశేషం.