Advertisementt

ఈ అమ్మడి హవా సాగుతోంది..!

Fri 10th Feb 2017 04:25 PM
heroine lavanya tripathi,ravi teja,sai dharam teja,sandeep kishan  ఈ అమ్మడి హవా సాగుతోంది..!
ఈ అమ్మడి హవా సాగుతోంది..!
Advertisement
Ads by CJ

తనతో పాటు, తనకన్నా తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన వారు రేసులో దూసుకుపోతుంటే హీరోయిన్‌ లావణ్యత్రిపాఠి మాత్రం వెనకబడింది. 'అందాల రాక్షసి'తో టాలీవుడ్‌కి ఎంటర్‌ అయిన నిజమైన అందాల రాక్షసి ఆమె. మొత్తానికి ఆమె కెరీర్‌ ఇప్పుడే వేగం అందుకుంది. ఆమె నటించిన 'భలే భలే మగాడివోయ్‌'తో పాటు 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాలను ఆమె కెరీర్‌ను మలుపుతిప్పాయి. ప్రస్తుతం ఆమెకు టైమ్‌ వచ్చింది.

ప్రస్తుతం ఈమె నాలుగు చిత్రాలతో బిజీగా ఉంది. దీంతో ఈ అమ్మడుకు మూడునాలుగేళ్ల తర్వాత దశ తిరిగిందంటున్నారు. సురేష్‌ప్రొడక్షన్స్‌, వారాహి చలన చిత్ర సంస్థలు సంయుక్తంగా నాగచైతన్యతో చేయబోయే చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. మెగాహీరో వరుణ్‌తేజ్‌తో శ్రీనువైట్ల తీస్తున్న 'మిస్టర్‌; రవితేజతో ఓ చిత్రం, సందీప్‌కిషన్‌ హీరోగా నటిస్తోన్న బైలింగ్వల్‌ మూవీ 'మాయావన్‌'లో కూడా మెరువనుంది. ఒక్కో ఇటుకను పేర్చి ఇంటిని కట్టినట్టుగా ఒక్కో చిత్రాన్ని ఒప్పుకుంటూ తన కెరీర్‌ను బిల్డ్‌ చేసుకుంటూ వస్తోంది. సో.. ఈ నాలుగు చిత్రాలతో ఆమె మెప్పిస్తే స్టార్‌ హీరోయిన్‌ కావడం గ్యారంటీ అంటున్నాయి సినీ వర్గాలు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ