Advertisementt

జూనియర్‌ కోసం అన్నయ్య త్యాగం...!

Fri 10th Feb 2017 12:08 PM
jr ntr,director babi,producer kalyan ram,jai lava kush movie,budget 100 crpres  జూనియర్‌ కోసం అన్నయ్య త్యాగం...!
జూనియర్‌ కోసం అన్నయ్య త్యాగం...!
Advertisement
Ads by CJ

తన మొదటి చిత్రం రవితేజతో 'పవర్‌' తీసి ఫర్వాలేదనిపించుకున్న బాబి రెండో చిత్రానికే పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటించే 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌'తో అనూహ్యమైన చాన్స్‌ రావడంతో ఆయన దశ తిరిగిపోయిందని భావించారు. కానీ ఈ చిత్రం డిజాస్టర్‌ కావడంతో ఆయనకు మరోసారి నిరాశ తప్పలేదు. కానీ హ్యాట్రిక్‌ విజయాలతో జోరుమీదున్న యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 'జనతా గ్యారేజ్‌' తర్వాత ఎవరితో చిత్రం చేయాలా? అని ఎందరో దర్శకులను పరిశీలించిన ఎన్టీఆర్‌ ఎట్టకేలకు బాబికి పచ్చజెండా ఊపడం కాస్త షాక్‌నిచ్చింది. ఆయన సినిమాలో ఏదో విషయం లేకుండానే ఎన్టీఆర్‌ అవకాశం ఇవ్వలేదని, ఇందులో ఎన్టీఆర్‌కు ఏదో అద్భుతమైన అంశం నచ్చినట్లే ఉందని అందరూ భావిస్తున్నారు. 

దాంతో ఎన్టీఆర్‌-బాబిల చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్‌ నటించే ఈ 27వ చిత్రాన్ని 100కోట్ల బడ్జెట్‌తో స్వయాన ఎన్టీఆర్‌ అన్నయ్య నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మించనుండటం మరో విశేషం. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలు, టైటిల్‌పై ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం నిర్మాత కళ్యాణ్‌రామ్‌, హీరో యంగ్‌టైగర్‌లు హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌లోని టాప్‌ టెక్నీషియన్స్‌ను తీసుకుంటున్నారు. దాంతో ఈ చిత్రం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం రేపే ప్రారంభోత్సవం జరుపుకుంటోంది. ఈ విషయాన్ని బాబి ట్వీట్‌ చేయడమే కాదు.. ఎన్టీఆర్‌ బ్రదర్స్‌ను ప్రశంసలలో ముంచెత్తాడు. 

ఎన్టీఆర్‌ మంచితనాన్ని, కళ్యాణ్‌రామ్‌ల పనితనాన్ని మెచ్చుకుంటూ తన లౌక్యం చూపిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే 'పటాస్‌' తర్వాత కళ్యాణ్‌రామ్‌ ఊపులోకి వచ్చాడు. పూరీతో తీసిన 'ఇజం' చిత్రం ఫ్లాప్‌ అయినప్పటికీ కళ్యాణ్‌రామ్‌ డిఫరెంట్‌ స్టైల్‌ బాగానే మెప్పించింది. కానీ ఆయన మాత్రం తన హీరో కెరీర్‌ను పక్కనపెట్టి, ఎన్టీఆర్‌తో చేసే చిత్రం కోసం తన సమయాన్నంతా కేటాయిస్తుండటం చర్చనీయాంశం అయింది. ఆయన పవన్‌ సాదినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. కానీ ఈ చిత్రం ఎన్టీఆర్‌ సినిమా పూర్తయ్యే వరకు పట్టేలెక్కే చాన్స్‌లు లేవని తెలుస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ