రామ్ చరణ్ 'ధృవ' చిత్రం హిట్ కొట్టి యమా జోష్ మీదున్నాడు. అలాగే తన తండ్రి 'ఖైదీ నెంబర్ 150' చిత్రానికి నిర్మాతగా చేసి బోలెడు డబ్బులు మిగిల్చుకున్నాడు. ఇక అదే ఊపులో చరణ్ తన తండ్రి 151 చిత్రాన్ని తానే నిర్మిస్తానని ప్రకటించేశాడు. మరో పక్క తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సుకుమార్ డైరెక్షన్ లో గత వారమే మొదలు పెట్టేసాడు. ఇక ఆ చిత్ర షూటింగ్ మార్చి మొదటి వారం నుండి సెట్స్ మీదకెళ్లనుందని సమాచారం.
సుకుమార్ రామ్ చరణ్ తో తెరకెక్కించబోయే ఈ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ అని చెబుతున్నారు. 1990 ప్రేమ కథగా ఈ చిత్రం ఉండబోతుందని...... ఆ పల్లెటూరి ప్రేమ కథకు తగ్గట్టు చరణ్ కూడా గుబురు గెడ్డంతో కొత్త లుక్ లో కనబడనున్నాడు. ఇప్పటికే సుకుమార్, చరణ్ ని పల్లెటూరి కుర్రాడిలా నీళ్ల బిందెల కావిడి మోస్తూ ఒక థీమ్ పోస్టర్ ని కూడా వదిలాడు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్న ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టె నాటికీ టైటిల్ ని ఖరారు చెయ్యాలనేయోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే ఈ చిత్రం కోసం రెండు టైటిల్ ని అనుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది గనక 'రేపల్లె' అని.... లేకుంటే 'పల్లెటూరి మొనగాడు' అనే టైటిల్స్ పెడితే బావుంటుందని చిత్ర యూనిట్ అనుకుంటుందట. మరి విలేజ్ బ్యాగ్ డ్రాప్ లో ఉంటుంది కాబట్టి ఈ టైటిల్స్ చక్కగా సరిపోతాయని సుకుమార్ కూడా భావిస్తున్నాడట. అయితే చరణ్ మాత్రం ఇంకా పవర్ ఫుల్ టైటిల్ ని వెతకమని సుకుమార్ కి సజెస్ట్ చేసాడట. ఇక ప్రస్తుతానికి ఆ రెండు టైటిల్స్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. మరోపక్క మెగా ఫ్యాన్స్ ఆ టైటిల్ చరణ్ కి అసలు సూట్ కావని.... మరీ అంత బిసి నాటి టైటిల్స్ జనాలకు ఎక్కువని అంటున్నారట. ఇక ఈ చిత్రంలో చరణ్ కి జోడిగా మొదటిసారి సమంత నటిస్తుంది.