కొన్నిసార్లు కొందరు స్టార్ హీరోలు కూడా ఒక్కొక్క హీరోయిన్‌ను సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. అది సహజం. ఇక 'బెంగాల్ టైగర్' తర్వాత మాస్‌మహారాజా రవితేజ ఏడాదికిపైగా గ్యాప్ తీసుకుని, ఇప్పుడు అనిల్ రావిపూడి 'రాజా దిగ్రేట్', విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' అనే రెండు చిత్రాలను ఒకేసారి షూటింగ్‌కు తీసుకుని వెళ్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆయనను కొందరు 'చేస్తే అతివృష్టి.. లేకపోతే అనావృష్టి' అంటూ సెటైర్లు కూడా మొదలుపెట్టారు. మాస్‌మహారాజాలో ఓ మంచి సుగుణం ఉంది.
ఆయన ఎవరికైనా మాటిస్తే దానిని నెరవేరుస్తాడు.కానీ ఈ గ్యాప్‌లో మాత్రం ఆయన చాలామంది యువ దర్శకులకు, నిర్మాతలకు సినిమాలు చేస్తానని మాటిచ్చి తప్పాడు. కానీ ఆయన ఓ వ్యక్తికి మాత్రం తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. 'బెంగాల్ టైగర్' చిత్రంలో ఆయన సరసన యంగ్ బ్యూటీ రాశిఖన్నా నటించింది. ఈ చిత్రంలో వారిద్దరి మద్య స్క్రీన్‌పై కెమిస్త్రీ బాగా వర్కౌట్ అయిందనే ప్రశంసలు లభించాయి. ఈ చిత్రం చేసిన తర్వాత రవితేజ రాఖిఖన్నాకు తనకు వీలైన్నని అవకాశాలు ఇస్తానని ప్రామిస్ చేశాడట.
అందుకు అనుగుణంగానే ఆయన గతంలో దిల్‌రాజు బేనర్‌లో వేణుశ్రీరాం దర్శకత్వంలో చేయాలని భావించిన 'ఎవడో ఒకడు' చిత్రంలో కూడా ఆమె పేరే తెరపైకి వచ్చింది. కానీ ఈ చిత్రం ఆ తర్వాత మూలనపడింది. మరలా ఇంతగ్యాప్ తర్వాత ఆయన దిల్‌రాజుతో 'రాజా ది గ్రేట్' చిత్రంలో చేస్తున్నాడు. ఇందులో కూడా రాఖిఖన్నా స్థానం మాత్రం మారలేదు. ఇక విక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న 'టచ్ చేసి చూడులో' కూడా రాశినే నటిస్తోంది. దీంతో రవితేజ ఆమెకు ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.