బాలీవుడ్‌లో రాజ్‌కుమార్ హిర్వాణికి ఉన్న పేరు అందరికీ తెలిసిందే. తీసింది కొద్ది చిత్రాలే అయినా ఆయన చిత్రాలన్నీ సంచలనమే. కాగా ఆయన మదిలో మెలిగిన ఓ ఐడియాకు రూపమే సంజయ్‌దత్‌తో ఆయన తీసిన 'మున్నాభాయ్ యం.బి.బి.యస్', 'లగే రహో మున్నాభాయ్' చిత్రాలు. ఇవి హిందీలో సంచలన విజయం సాధించాయి. దాంతో ఈ చిత్రాలపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చూపు పడింది. దాంతో ఆయన 'శంకర్‌దాదా యం.బి.బి.యస్', 'శంకర్‌దాదా జిందాబాద్'లు చేశాడు. కానీ తెలుగులో 'శంకర్‌దాదా యం.బి.బి.యస్' ఘనవిజయం సాధించి చిరు కెరీర్‌లో ఓ మంచి చిత్రంగా దుమ్మురేపింది. జబ్బులను మందులతో కాకుండా మనసుతో కూడా నయం చేయవచ్చనే ఈ కాన్సెప్ట్‌ను చిరు తన కామెడీతో కడుపుబ్బ నవ్వించి భారీ హిట్ కొట్టాడు.
ఇక గాంధీగిరి నేపథ్యంలో వచ్చిన 'లగే రహో మున్నాభాయ్' చిత్రం హిందీలో సంచలన విజయం సాధించినా కూడా తెలుగు ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది. తాజాగా చిరు 'ఖైదీ' చిత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చి, అదరగొట్టి వరుస చిత్రాలను లైన్‌లో పెడుతున్నాడు. మరోపక్క దర్శకుడు రాజ్‌కుమార్ హిర్వాణీ కూడా సంజయ్‌దత్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఇక తాజా విశేషం ఏమిటంటే... రాజ్‌కుమార్ హిర్వాణీ త్వరలో తాను 'మున్నాభాయ్' సిరీస్‌లో 3వ భాగాన్ని తీయనున్నానని, స్టోరీకూడా దాదాపు పూర్తికావచ్చిందని, ఇందులో కూడా సంజయ్‌దత్తే నటిస్తాడని క్లారిటీ ఇచ్చాడు. సో.. చిరు కన్ను ప్రస్తుతం ఈ 'మున్నాభాయ్ సిరీస్‌లోని పార్ట్ 3 పడనుంది. ఇది తెలిసిన మెగాభిమానులు హిందీలో ఆ చిత్రం హిట్టవుతుందా? ఎలా ఉండనుంది? అనే విషయాలపై ఆసక్తి చూపిస్తున్నారు.