Advertisementt

మహేష్‌ మంచి ఛాన్స్ మిస్సయినట్లే..!

Thu 09th Feb 2017 12:31 PM
mahesh babu,murugadoss,summer season  మహేష్‌ మంచి ఛాన్స్ మిస్సయినట్లే..!
మహేష్‌ మంచి ఛాన్స్ మిస్సయినట్లే..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం మురుగదాస్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ 80శాతానికి పైగా పూర్తయింది. త్వరలో ముంబైతో పాటు పూణె, గుజరాత్‌లలో జరగనున్న చిన్న చిన్న షెడ్యూల్స్‌తో ఈచిత్రం పూర్తవుతుంది. కాగా ఈ చిత్రం టైటిల్‌ను ఎప్పుడో ఫిక్స్‌ చేసినా కూడా ఇంకా దానిని అధికారికంగా ప్రకటించడం లేదు. మరి దీనికి కారణం ఏమిటో యూనిట్‌కు తప్ప మరెవ్వరికీ తెలియదు. గతంలో మహేష్‌ నటించిన 'అతడు, దూకుడు' చిత్రాలకు అద్భుతమైన టైటిల్‌ సాంగ్స్‌ను (ఇంట్రో) రచయిత విశ్వ రాశాడు. ఆ రెండు పాటలు ఆయనకు రచయితగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. తాజాగా మురుగదాస్‌ చిత్రానికి కూడా టైటిల్‌ సాంగ్‌ను విశ్వనే రాస్తున్నాడు. దీన్ని బట్టి ఈ చిత్రం టైటిల్‌ ఖరారైందనేది విషయం స్పష్టమైపోతోంది. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో రిలీజ్‌ చేయాలని భావించినప్పటికీ అదే నెలలో 'బాహుబలి2' రిలీజ్‌ కానుండటంతో ఈ చిత్రాన్ని ఏకంగా జూన్‌ 23న రిలీజ్‌ చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. అవే నిజమైతే మాత్రం మహేష్‌ వేసవి సీజన్‌ను మిస్‌ అవుతున్నాడనే చెప్పవచ్చు. 'బాహుబలి2' కి గ్యాప్‌ ఇవ్వాలని భావిస్తే వేసవి చివరిలోనే అంటే ఇంకా సమ్మర్‌ హాలిడేస్‌ మిగిలి ఉండగానే మే నెలలో రిలీజ్‌ చేయవచ్చు. కానీ ఏకంగా జూన్‌ చివరి వారానికి వెళ్లితే మాత్రం మహేష్‌ మంచి సీజన్‌ను మిస్‌ అవుతున్నాడనే చెప్పాలి. కాగా ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ