Advertisementt

అక్కడ 'హలో బ్రదర్' కి సీక్వెల్..!

Thu 09th Feb 2017 12:24 PM
hello brother sequel,nagarjuna,naga chaitanya,lavanya tripathi,judwaa 2  అక్కడ 'హలో బ్రదర్' కి సీక్వెల్..!
అక్కడ 'హలో బ్రదర్' కి సీక్వెల్..!
Advertisement
Ads by CJ

కింగ్‌ నాగార్జున తన కొడుకులైన నాగచైతన్య, అఖిల్‌ల కెరీర్‌ను, వారు చేసే చిత్రాలను, స్టోరీలను, దర్శకులను కన్‌ఫర్మ్‌ చేస్తూనే మరోపక్క వారిని వ్యక్తిగతంగా కూడా ఓ ఇంటివారిని చేస్తున్నాడు. ఇక గతంలో స్వర్గీయ ఇవివి దర్శకత్వంలో నాగార్జున నటించిన 'హలో బ్రదర్‌' చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. ఈ చిత్రం నాగ్‌లోని కొన్ని కోణాలను హైలైట్‌ చేసి, ఆయన కెరీర్‌లో ఓ మరపురాని చిత్రంగా మిగిలిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌ చేయాలని భావించిన నాగచైతన్య 'ఢమరుకం' దర్శకుడు శ్రీనివాసరెడ్ది డైరెక్షన్‌లో సి.కళ్యాణ్‌ నిర్మాతగా చిత్రం షూటింగ్‌ను కూడా ప్రారంభించి అనేక కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ను మధ్యలో వదిలేయడంతో అక్కినేని అభిమానులు ఎంతగానో నిరాశ చెందారు. ఇక నాగ్‌ నటించిన 'హలో బ్రదర్‌' విషయానికి వస్తే ఈ చిత్రం అనేక భాషల్లో రీమేక్‌ అయింది. దాదాపు అన్ని భాషల్లోనూ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని సల్మాన్‌ఖాన్‌ హీరోగా దర్శకుడు డేవిడ్‌ ధావన్‌ 'జుడ్వా' పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేశాడు. అక్కడ కూడా ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. దీంతో ఇంతకాలానికి ఈ చిత్ర దర్శకుడు డేవిడ్‌ధావన్‌ ఈ చిత్రానికి సీక్వెల్‌ను అనౌన్స్‌ చేసి తాజాగా ఈచిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశాడు. 

ఇందులో వరణ్‌ధావన్‌ హీరోగా నటిస్తుండగా, జాక్వలినా ఫెర్నాండేజ్‌, తాప్సిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 29న రిలీజ్‌ కానుంది. కానీ 'జుడ్వా'కు కొనసాగింపుగా ఈ టైటిల్‌ను పెట్టామే గానీ ఆ చిత్రానికి ఈ చిత్రానికి పేరులో తప్ప కథలో సంబంధం ఉండదని దర్శకుడు అంటున్నాడు. మరి ఈ చిత్రం విడుదలైన తర్వాత బాగా ఆడి నాగ్‌, చైతూలను ఇంప్రెస్‌ చేస్తే ఈ చిత్రాన్ని తెలుగులో చైతూ రీమేక్‌ చేసే అవకాశం ఉందంటున్నారు. కాగా ప్రస్తుతం చైతూ జోరు మీదున్నాడు. తన తండ్రికి 'సోగ్గాడే.. ' వంటి బ్లాక్‌బస్టర్‌ని అందించిన కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం షూటింగ్‌ మరికొద్ది కాలంలో పూర్తి కానుంది. సాధారణంగా సినిమా విడుదలకు ముందే తమ చిత్రం అద్భుతంగా ఉంటుందని డప్పు వాయించే వ్యక్తి నాగ్‌ కాదు. కానీ ఆయన సైతం ఈ చిత్రం తాను నటించిన 'నిన్నేపెళ్లాడతా' తరహాలో ఉండి, ఓ కొత్త ట్రెండ్‌ను క్రియేట్‌ చేసే లవ్‌ అండ్‌ ఫ్యామిలీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలిపాడు. దర్శకుడు కళ్యాణ్‌కృష్ణపై నాగ్‌ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. తాజాగా వారాహిచలన చిత్రం బేనర్‌లో చైతూ కొత్త దర్శకుడు కృష్ణ మురిముత్తు దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం ప్రారంబించాడు. ఇందులో తన తండ్రికి కలిసొచ్చిన లావణ్యత్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. 'ప్రేమమ్‌, సాహసం శ్వాసగా సాగిపో' చిత్రాలు కేవలం నెల వ్యవధిలోపే విడుదలయ్యాయి. కాస్త గ్యాప్‌ ఇచ్చినా కూడా చైతు జోరు మీదనే ఉన్నాడని చెప్పాలి...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ