Advertisementt

బాలయ్య 101 ఇదే కావచ్చు..!

Thu 09th Feb 2017 12:16 PM
balakrishana,101st movie,ks ravikumar,balakrishna new movie  బాలయ్య 101 ఇదే కావచ్చు..!
బాలయ్య 101 ఇదే కావచ్చు..!
Advertisement
Ads by CJ

బాలయ్య నటించిన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం సాధించిన ఘన విజయంతో ఆయన సంతోషంగా ఉన్నాడు. కాగా ఆయన తన 101వ చిత్రంగా కృష్ణవంశీతో 'రైతు' ఉంటుందని ప్రకటించినప్పటికీ ఈ చిత్రం విషయంలో ఓ మెలికపెట్టాడు. ఇందులోని కీలకపాత్రకు బిగ్‌బి అమితాబ్‌ ఒప్పుకుంటేనే ఈ చిత్రం ఉంటుందని తేల్చేశాడు. ప్రస్తుతం కృష్ణవంశీ కూడా వర్మతో ఈ విషయమై సహాయం కోరుతున్నాడని సమాచారం. మరి బిగ్‌బి ఒప్పుకుంటేనే బాలయ్య 101వ చిత్రంగా కృష్ణవంశీ 'రైతు' ఉంటుందని తేలిపోయింది. ఇక బాలయ్య దృష్టిలో ఎస్వీకృష్ణారెడ్డితో పాటు పలువురు దర్శకులున్నారనే వార్తలు వస్తున్నాయి. కానీ వాస్తవానికి బాలయ్య దృష్టిలో 'రైతు'తో పాటు మరో మూడు చిత్రాలు ఉన్నాయి. ఇందులో ప్రముఖ సీనియర్‌ తమిళ దర్శకుడు కె.యస్‌.రవికుమార్‌ చిత్రం ఒకటి. ఇక రెండోది బాలయ్య తాజాగా ప్రకటించిన తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ బయోపిక్‌. వీటితో పాటు బెల్లంకొండతో బోయపాటి దర్శకత్వంలో కూడా ఓ చిత్రం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. మరో విశ్వసనీయ సమాచారం ప్రకారం బాలయ్యకు ఇటీవల ఓ కొత్త దర్శకుడు అద్భుతమైన కథను చెప్పాడని, దాంతో బాలయ్య కూడా ఇంప్రెస్‌ అయ్యాడని తెలుస్తోంది. సో.. ఈ చిత్రాలలో బాలయ్య 101వ చిత్రం ఏది కానుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజా సమాచారం ప్రకారం కె.యస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో బాలయ్య నటించే 101వ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కావచ్చని అంటున్నారు. ఈ చిత్రానికి సి.కళ్యాణ్‌ నిర్మాత అని తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ