Advertisementt

చిరు కన్నా.. యంగ్‌టైగరే ఎక్కువా..?

Wed 08th Feb 2017 11:38 AM
jr ntr,jai lava kusa,nil nithin mukhesh,bobby  చిరు కన్నా.. యంగ్‌టైగరే ఎక్కువా..?
చిరు కన్నా.. యంగ్‌టైగరే ఎక్కువా..?
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్‌ 150' తమిళ 'కత్తి' కి రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. కాగా 'కత్తి'లో విలన్‌గా బాలీవుడ్‌కి చెందిన నీల్‌ నితిన్‌ ముఖేష్‌ నటించాడు. అయితే 'కత్తి' రీమేక్‌ అయిన 'ఖైదీ..' చిత్రంలో కూడా ఆయన్నే విలన్‌గా నటింపజేయడానికి వినాయక్‌, నిర్మాత రామ్‌చరణ్‌, చిరు ప్రయత్నించారు. కానీ ఆయన నో చెప్పాడనే టాక్‌ ఉంది. తాజాగా ఎన్టీఆర్‌ నటించే ఓ చిత్రంలో విలన్‌గా నటించడానికి ఈయన ఒప్పుకోవడం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది. త్వరలో ఎన్టీఆర్‌ హీరోగా నటించనున్న 27వ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. బాబి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ అన్న నందమూరి కళ్యాణ్‌రామ్‌ తన ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నిర్మించనున్నాడు.ఈ చిత్రం బడ్జెట్‌ 100కోట్లని సమాచారం. ఇందులో ఎన్టీఆర్‌ 'అదుర్స్‌'లోని చారి తరహా కామెడీ పాత్రను, ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రతో పాటు ఓ నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రను కూడా చేస్తున్నాడని, ఇందులో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం హైలైట్‌ కానుందని, దీనికి 'జై లవ కుశ' అనే టైటిల్‌ను పెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక చిరు చిత్రానికి నో చెప్పిన నీల్‌ నితిన్‌ ముఖేష్‌ మొదట ఈ చిత్రానికి కూడా పెద్దగా ఆసక్తి చూపలేదని, కానీ హీరోగా ఎన్టీఆర్‌ నటిస్తున్నాడని చెప్పడంతో ఓకే చేశాడని సమాచారం. ఎన్టీఆర్‌ చిత్రానికి పలు బాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన సి.కె.మురళీధరన్‌ సినిమాటోగ్రఫీ అందించనుండగా, 'రోబో' తోపాటు పలు హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన టెక్నీషియన్‌ వాన్సీ హార్టీవెల్‌ పనిచేయనుండటం విశేషం. టెక్నాలజీని ఉపయోగించి మనుషులను విభిన్న రూపాలలో చూపించడంలో వాన్సీ సిద్దహస్తుడు. ఈ ఎన్టీఆర్‌ చిత్రం కోసం ఆయనను భారీ రెమ్యూనరేషన్‌కు ఒప్పించారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ ఆయనతో తీసుకున్న ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ