Advertisementt

ఎన్టీఆర్ బయోపిక్ లో వీటిని చూపిస్తారా?

Wed 08th Feb 2017 11:25 AM
ntr biopic,balakrishna,important scenes in ntr biopic,sr ntr  ఎన్టీఆర్ బయోపిక్ లో వీటిని చూపిస్తారా?
ఎన్టీఆర్ బయోపిక్ లో వీటిని చూపిస్తారా?
Advertisement
Ads by CJ

బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని, ఆ బయోపిక్ లో తానే ఎన్టీఆర్ పాత్ర చేస్తానని కూడా చెప్పాడు. అయితే దీనికి ఇంకా డైరెక్టర్ సెట్ కాలేదని.... సినిమా మొదలు పెట్టేది ఎక్కడో.... సినిమాని ఎలా పూర్తి చెయ్యాలో తనకి తెలుసునని చెప్పాడు. ఇంకా ఈ బయోపిక్ లో ప్రజలకు తెలియని చాలా విషయాలను చూపిస్తామని  చెబుతున్నాడు. మరి నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఎనౌన్స్ చేసాడో... లేదో.. నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ దాని గురించే చర్చ లు మొదలు పెట్టారు. 

ఇక బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమారంగ ప్రవేశం దగ్గరనుండి రాజకీయ రంగ ప్రవేశం వరకు అన్ని విషయాలు ఈ సినిమా ద్వారా చూపిస్తానని చెబుతున్నాడు. మరి జూనియర్ ఎన్టీఆర్ ని తన తండ్రి ఎన్టీఆర్ దగ్గరకు తియ్యడం, ఎన్టీఆర్ రెండో పెళ్లి ముచ్చట్లు దీనిలో చూపిస్తాడా? ఒక వేళ చూపిస్తే లక్ష్మి పార్వతిని ఇందులో విలన్ గా చూపెడతా? అసలు ఆమెను ఎన్టీఆర్ కొడుకులు, అల్లుడు చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్ భార్య గానే ఒప్పుకోవడం లేదు. మరి అదే విషయాన్ని అందరికి వివరించగలడా....బాలకృష్ణ లేదంటే ఎదో ఎన్టీఆర్ జీవిత చరిత్రలో కొన్ని అంశాలనే చూపెట్టి ఇదే ఎన్టీఆర్ జీవితం అంటాడా? అసలు నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ ని చివరి దశలో దూరం పెట్టిన సంగతులు వివరిస్తాడా? లేదా? అనే విషయం దగ్గర నుండి .. మరి తన బావ ఏపీ సీఎం చంద్రబాబు తన తండ్రి ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడవడం వంటి అంశాలు ఈ చిత్రం లో చూపెడతాడా? లేక తన బావ చంద్రబాబు ని హైలెట్ చేస్తాడా? అనేది మాత్రం బాలకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు తెలుస్తుంది.

ఏదో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని చెబుతున్నాడు కదా.... అసలు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా... అనేది కూడా పెద్ద ప్రశ్నే. ఎందుకంటే నందమూరి ఫ్యామిలిలో ఎన్టీఆర్ జీవితం గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అంతా తెలిసిన విషయమే. మరి బాలకృష్ణ గనక ఎన్టీఆర్ ని నిజమైన హీరోగా చూపెట్టగలుగుతాడా..... అనేది మాత్రం తీవ్రం గా ఆలోచించాల్సిన సంగతే. చూద్దాం ఆ చిత్రం సెట్స్ మీదకెళ్లాక కదా ఆ విషయాలు మాట్లాడుకోవాల్సింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ