బుల్లితెర మీద తన యాంకరింగ్ తో ప్రేక్షకులని మాయ చెయ్యడమే కాదు.. తనదైన శైలిలో యాంకర్ అనే పదానికి కొత్త అర్ధం నేర్పింది సుమ. అసలు సుమ ఎటువంటి గ్లామర్ షో ని ప్రదర్శించకుండానే తన మాటలతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసేటువంటి ఒక కళ ఆమెకి దేవుడిచ్చన వరం. ఇక ఒక్క యాంకరింగ్ రంగంలోనే కాక ఒక ప్రొడక్షన్ హౌస్ ని కూడా ఏర్పాటు చేసి ప్రముఖ ఛానెల్స్ లో గేమ్ షోస్ ని కూడా నిర్మిస్తుంది. ఇక సుమకి తన భర్త రాజీవ్ కనకాల, అత్తమామలు బాగా సపోర్ట్ చేస్తారని ఆమె బహిరంగంగానే అందరికి చెబుతుంది. సుమ ఆడియో వేడుకలకి, ప్రత్యేక కార్యక్రమాలకి కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది.
ఇక సుమ యాంకరింగ్ చేసేటప్పుడు డాన్స్ వంటివి కూడా చేస్తుంది. అయితే సుమ పాటల గురించి చెప్పక్కర్లేదు. సుమ సినిమాల్లో పాటలు పాడదు గాని ఆమె గాత్రానికి ఆమె ఎప్పుడో నెంబర్ 1 సింగర్ కూడా అయ్యుండేది. అయితే సింగర్ అయ్యే అవకాశం ఇప్పుడు సుమ కు వచ్చింది. ఏకంగా సుమ ఒక సినిమాలో పాట కూడా పాడేసింది. ఎప్పుడూ టీవీలో మాత్రమే హమ్ చేసే సుమ ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం 'విన్నర్' లో ఒక పాట పాడి అందరికి షాక్ ఇచ్చింది. ఇక ఆ పాట మాములు పాట కాదు ఒక ఐటెం సాంగ్ అట. 'విన్నర్' లో ఐటెం సాంగ్ కి డాన్స్ చేసింది ఎవరో మీకు తెలిసే ఉంటుంది. యాంకర్ అనసూయ 'విన్నర్' చిత్రంలో ఒక ఐటెం సాంగ్ చేస్తుందని తెలిసిన విషయమే. అనసూయ ఆడిన ఆటకి సుమ పాట పడిందట. ఈ విషయాన్ని 'విన్నర్' చిత్ర బృందమే స్వయం గా తెలిపింది.
ఇక ఆ పాట 'సుయ సుయ...అనసూయ' అని అనసూయని ఉద్దేశించి రాసిందని చెబుతున్నారు. ఆ పాటనే సుమ పాడిందట. మరి ఈ సాంగ్ యూట్యూబ్ లో విడుదల చేశారు. సుమ పాడిన ఆ 'అనసూయ' గీతం కనుక హిట్ అయితే మరికొన్ని గీతాలు సుమ గొంతుతో పాడించేందుకు టాలీవుడ్ మేకర్స్ లైన్ లోకి రావడం ఖాయం.