స్టార్‌గా మారినప్పటి నుంచి బన్నీ తన కెరీర్‌ను ఎంతో జాగ్రత్తగా ప్లాన్‌చేసుకుంటున్నాడు. విభిన్న చిత్రాలను చేయడంపై దృష్టి పెట్టాడు. అదే సమయంలో కమర్షియల్ కోణాన్ని కూడా ఆయన వదలడం లేదు. ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ రేసుగుర్రం 'సరైనోడు' తర్వాత దాదాపు నాలుగునెలలు గ్యాప్ తీసుకుని హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా 'డిజె' (దువ్వాడ జగన్నాథం)కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రం షూటింగ్‌లో ఆయన ఆలస్యంగా జాయిన్ అయ్యాడు. కాస్త ఆలస్యంగా వచ్చినా కూడా జెట్ స్పీడ్‌తో ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఐరన్‌గర్ల్‌గా ముద్రపడిన పూజాహెగ్డేతో కలిసి నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 60శాతం వరకు పూర్తయిందని సమాచారం. ఈచిత్ర వివరాలు, సమాచారం బయటకు రాకుండా ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బన్నీకి, దిల్‌రాజుల టేస్ట్‌కు అనుగుణంగా ఈ చిత్రం కోసం రాకింగ్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ అత్యద్భుతమైన ట్యూన్స్ అందిస్తున్నట్లు సమాచారం. మార్చిలోపు షూటింగ్‌ను పూర్తి చేసి సమ్మర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. స్టైలిష్ యాక్షన్‌ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఇందులో బన్నీ మరో స్టైలిష్ లుక్‌తో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం తొలి టీజర్‌ను విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి .ప్రస్తుతం యూనిట్ ఆ పనిలో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. త్వరలో తేదీని ప్రకటించనున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్‌తో పాటు ఎడిటింగ్ పనిని కూడా సమాంతరంగా జరుపుతున్నారు. ఇటీవలే బాలీవుడ్ దర్శకుడు రోహత్‌శెట్టి ఈ షూటింగ్ సెట్లో సందడి చేయడంతో ఈ చిత్రానికి మరింత క్రేజ్ ఏర్పడింది. మొత్తానికి ఈ చిత్రం ద్వారా బన్నీ విజయపరంపరను కొనసాగించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.