Advertisementt

జగ్గుభాయ్‌ని.. వదలలేరంతే!

Tue 07th Feb 2017 07:35 PM
jagapathi babu,jagapati babu movies,jagapathi babu character  జగ్గుభాయ్‌ని.. వదలలేరంతే!
జగ్గుభాయ్‌ని.. వదలలేరంతే!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో నాగార్జున తర్వాత అందరూ జెంటిల్‌మేన్‌గా ఒప్పుకునే వ్యక్తి జగపతిబాబు. గతంలో హీరోగా తనకంటూ ఓన్‌ ఐడెంటిటీ తెచ్చుకుని శోభన్‌బాబు తర్వాత అంతలా ఫ్యామిలీ ఇమేజ్‌ తెచ్చుకోవాలని ప్రయత్నించాడు. ఒకానొక సమయంలో అది నెరవేరే సూచనలు కూడా కనిపించాయి. కానీ అదే సమయంలో హీరోగా, నిర్మాతగా కొన్ని తప్పులు చేశాడు. దాంతో పెద్దగా సక్సెస్‌ కాలేకపోయాడు. ఇక 'లెజెండ్‌' చిత్రంలో విలన్‌గా తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, తానే ఊహించని బిజీగా మారిపోయాడు. స్టైలిష్‌ విలన్‌గా, తండ్రి.. ఇలా పలు మంచి క్యారెక్టర్స్‌ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం వంటి భాషల్లో కూడా బిజీ బిజీగా మారాడు. ఆయనకున్న ప్లస్‌ పాయింట్‌ ఏమిటంటే... ఆయనతో పనిచేసిన దర్శకులు, హీరోలు, హీరోయిన్లు.. ఇలా అందరూ ఆయనతో మరలా మరలా నటించాలని కోరుకుంటారు. 

'లెజెండ్‌' చిత్రంలో జగపతి ని విలన్‌గా ఒప్పించిన బోయపాటి శ్రీను ఇప్పుడు మరో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో కూడా జగపతిబాబు కీలకపాత్రను పోషిస్తున్నది విదితమే. ఇక సుకుమార్‌ దర్శకత్వంలో ఆయన 'నాన్నకు ప్రేమతో'లో నటించాడు. ఇప్పుడు అదే సుకుమార్‌.. రామ్‌చరణ్‌తో చేయబోయే చిత్రంలో కూడా జగపతినే పెట్టుకున్నాడు. కొరటాల శివతో 'శ్రీమంతుడు'లో చేసిన జగపతి చే కొరటాల.. 'జనతా గ్యారేజ్‌'కు వాయిస్‌ ఓవర్‌ చెప్పించాడు. త్వరలో మహేష్‌తో దానయ్య నిర్మాతగా చేయబోయే చిత్రంలో కూడా కొరటాల జగపతి కోసం ఓ స్పెషల్‌ క్యారెక్టర్‌ను డిజైన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తమిళ సూపర్‌స్టార్‌ రజనీతో గతంలోనే ఆయన 'కథానాయకుడు' చిత్రంలో నటించాడు. ఇక 'లింగా'లో కూడా చేశాడు. విజయ్‌తో పాటు మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ చిత్రాలలో కూడా జగ్గుబాయ్‌ నటించాడు. వారు కూడా తమ తదుపరి చిత్రాలలో జగపతిని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి జగ్గుభాయ్‌ని అందరూ అభినందించాల్సిందే....! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ