గత వారం రోజుల నుండి మీడియా మొత్తం మెగా మల్టి స్టారర్ చిత్రం ఎప్పుడు మొదలవుతుంది. ఆ స్టోరీ ఎలా ఉండబోతుంది? ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, చిరంజీవి ఎలా కనబడనున్నారు? అసలు వీరిద్దరూ కలిసి సినిమా చేస్తారా? లేక ఎదో సుబ్బరామిరెడ్డికి పనేం లేక ఇలాంటి ఎనౌన్సమెంట్ ఇచ్చాడా.. అని ఒకటేమిటి పలు రకాలా కథనాలు మీడియా, సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వినబడుతున్నాయి. ఇక తాజాగా ఈ మెగా మల్టి స్టారర్ చిత్రంలో నాగబాబు కూడా ఉన్నాడనే ప్రచారం జరుగుతుంది. మరి త్రివిక్రమ్ ఈ ముగ్గురి బ్రదర్స్ ని ఎలా చూపించబోతున్నాడు... ముగ్గురిని బ్రదర్స్ గానే చూపెడతా? లేక వేరే కేరెక్టర్స్ ఎమన్నా డిజైన్ చేస్తాడా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
అయితే ఈ మెగా ప్రాజెక్ట్ పనులు అప్పుడే మొదలైపోయాయని అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి స్టోరీ లైన్ ని త్రివిక్రమ్ రెడీ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఇక ఈ మెగా మల్టి స్టారర్ లో పవన్, చిరు లు ఇద్దరూ బ్రదర్స్ గానే కనిపిస్తారని.... ఈ చిత్రం 1960 లో హిట్టయిన ఒక చిత్ర కథని మూల కథగా తీసుకుని కొంచెం మార్పులు చేర్పులు చేసి లేటెస్ట్ ట్రెండ్ కు తగినట్లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని టాక్. ఇక ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులని శరవేగంగా పూర్తి చేసి... స్క్రిప్ట్ లాక్ చేసి ఏప్రిల్ నెలాఖరుకల్లా సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లి..... వచ్చే సంక్రాతి రేసులో సినిమా విడుదల చెయ్యాలని మేకర్స్ ప్లాన్ గా చెబుతున్నారు.
మరి త్రివిక్రమ్ చేసే పవన్ చిత్రం, ఎన్టీఆర్ చిత్రాలను ప్రస్తుతానికి పక్కన పెట్టేసి ఈ మల్టి స్టారర్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడా? లేక పవన్ చిత్రం కంప్లీట్ అయ్యాక మెగా మల్టి స్టారర్ మొదలెడతాడా? అనేది కూడా తెలియాల్సి వుంది. మరో పక్క ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ డిస్పాయింట్ చేస్తాడనే వార్తలొస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.