సమంతతో ఒక్కసారి కలిసి నటించిన హీరోలు మరలా మరలా ఆమెనే కావాలనుకుంటారు. అంతేకాదు.. ఆమెతో కలిసి ఒక సినిమాలో నటించిన హీరోయిన్లు కూడా మరలా మరలా ఆమెతో నటించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ విషయం ఇప్పటికే పలుసార్లు నిరూపితమైంది. కాజల్‌తో సమంత ఎన్టీఆర్ హీరోగా నటించిన 'బృందానం'లో కలిసి నటించింది. ఇందులో మెయిన్ హీరోయిన్ కాజల్‌కాగా, సెకండ్ హీరోయిన్ సమంత. ఆ తర్వాత మరలా వారు మహేష్ నటించిన 'బ్రహ్మూెత్సవం'లో కలిసి నటించారు. ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్'లో సమంత హీరోయిన్‌గా నటించగా కాజల్ ఐటంసాంగ్‌లో నర్తించింది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి మరోసారి తమిళ స్టార్ విజయ్ 61వ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అంతేకాదు.. సమంత నిత్యామీనన్‌తో కలిసి 'సన్నాఫ్ సత్యమూర్తి, 24, జనతా గ్యారేజ్'లలో కలిసి నటించింది. అలాగే అమీజాక్సన్‌తో కలిసి 'తంగమహన్, తేరీ' చిత్రాలలో నటించింది. ఇక ప్రణీత సమంతతో 'అత్తారింటికి దారేది, రభస' చిత్రాలలో కలిసి నటించింది. ఇక శ్యాం.. అనుపమపరమేశ్వరన్‌తో 'అ...ఆ' చిత్రంలో కలిసి నటించింది. వీరిద్దరు త్వరలో ప్రారంభం కానున్న సుకుమార్-రామ్‌చరణ్‌ల చిత్రంలో కూడా కలిసి నటించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తనికి సమంత అందరినీ మాయ చేసేస్తూ 'మాయలేడీ'గా ముద్దుగా పిలువబడుతోంది.