దేశంలోని సినీనటీనటులలో అత్యధిక సంపాదన కలిగిన హీరో ఎవరనే విషయం తెలిసిపోయింది. వరుస హిట్లలో ఉన్న సల్మాన్, అమీర్‌ల కంటే రేసులో కాస్త వెనుకబడిన షార్‌ఖ్‌ఖానే దేశంలో అత్యధిక సంపాదనను ఆర్జిస్తున్నాడని తేలింది. షారుక్ తర్వాత సల్మాన్ రెండో స్థానంలో, అమీర్ మూడోస్థానంలో ఉండగా, నాలుగోస్థానం అక్షయ్‌కుమార్‌కి దక్కింది. షారుక్ అందరికంటే ఎక్కువ సంపాదించడం వెనుక చాలా కారణాలున్నాయి. షారుక్ హీరోగానే కాదు.. ప్రొడక్షన్ కంపెనీ, యాడ్స్, ఐపిఎల్‌తో పాటు ఎన్నో బిజినెస్‌లు చేస్తుంటాడు. దాంతోనే ఆయనకు మొదటి స్థానం దక్కింది. ఇక రెండో స్థానంలో ఉన్న సల్మాన్ విషయానికి వస్తే ఆయన రెమ్యూనరేషన్ ఎక్కువ తీసుకుంటుంనప్పటికీ, ఎక్కువ యాడ్స్‌ను చేయడు. ఇక అతనికంటూ ఇతర బిజినెస్‌లు లేవు. అమీర్ విషయానికి వస్తే ఆయన ఏడాదికి ఒక సినిమా చేయడం కూడా కష్టమే. ఇక ఇతర బిజినెస్‌లు లేవు. యాడ్స్ చేయడంపై ఆయనకు పెద్దగా ఆసక్తిలేదు. కాబట్టే సినిమాల రెమ్యూనరేషన్‌పరంగా షారుక్ కంటే సల్మాన్, అమీర్‌లు ఎక్కువ తీసుకుంటున్నప్పటికీ ఇప్పటికీ కింగ్‌ఖానే సంపాదనలో 'డాన్'గా సర్వేలు తేల్చిచెప్పాయి.