రామ్‌చరణ్‌ ప్రయత్నాలు ఫలించేనా..?

రామ్‌చరణ్‌.. కెరీర్‌ మొదట్లో ఆరు ఫైట్లు, ఐదు పాటలు, ఓ స్పెషల్‌ ఐటం సాంగ్‌, కాసేపు కామెడీ వంటి ఫక్తు కమర్షియల్‌ చిత్రాలను చేసుకుంటూ వెళ్లాడు. మొదట్లో ఈ ఫార్ములా ఆయనకు బాగానే కలిసొచ్చింది. కానీ రాను రాను అది అడ్డం తిరిగింది. దీంతో కాస్త డిఫరెంట్‌గా చిత్రాలను చేస్తున్న బన్నీ కంటే రేస్‌లో వెనుకబడ్డాడు. ఈ సమయంలో ఆయనపై పలు విమర్శలు వచ్చాయి. విభిన్న చిత్రాలను ఎంచుకోవాలనే వాదనలు వినిపించాయి. ఆయన ఆ విమర్శల సారాన్ని అర్ధం చేసుకున్నాడు. దాంతో పాటు ఆయన కెరీర్‌పరంగా చిత్రాలను ఎంచుకుంటున్న పద్దతిపై మణిరత్నం వంటి వారు కూడా ఆయనకు ఎన్నో సలహాలిచ్చారని సమాచారం. దాంతో ఆయన తన పంథా మార్చాడు. 'ధృవ' చిత్రంతో ఓ విభిన్న ప్రయోగం చేశాడు. ఇక ప్రస్తుతం సుకుమార్‌ చిత్రంలో కూడా పక్కా పల్లెటూరి కుర్రాడిగా కనిపించనున్నాడు. ఈ చిత్రం ఓపెనింగ్‌ లుక్‌లోనే ఆయన పంచెపైకి కట్టి, కావడి మోస్తూ వెనుక నుంచి వేసిన ఛాయాచిత్రం బాగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత కూడా ఆయన కొరటాల శివతో ఓ సందేశాత్మకమైన చిత్రాన్ని, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ మంచి ఫ్యామిలీ సెంటిమెంట్‌ చిత్రాన్ని, గౌతమ్‌ మీనన్‌ లేదా క్రిష్‌ల దర్శకత్వంలో ఓ స్పైథ్రిల్లర్‌ను చేయనున్నాడని సమాచారం. ఇక మణిరత్నం దర్శకత్వంలో కూడా ఆయన ఓ క్లాసిక్‌ మూవీ చేసేందుకు సింసిద్దుడవుతున్నాడు. ఇక 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌రాజా'లు తీసిన మేర్లపాక గాంధీని కూడా చరణ్‌ ఓ మంచి ఎంటర్‌టైనింగ్‌ స్టోరీనీ తయారు చేయమని ఆదేశించాడనే వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి చరణ్‌ కొత్త ప్రపంచంలోకి వచ్చాడు. ఆయన నిర్ణయాలను ఇప్పుడు ప్రశంసించాల్సిందే. 

ram charan
ram charan movies
mega power star
sukumar
ram charan next movies list