ఎప్పుడెప్పుడు పవన్ 'కాటమరాయుడు' టీజర్ చూద్దామా.. అని ఎదురు చూస్తున్న మెగా ఫాన్స్ నిరీక్షణ ఫలించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' టీజర్ తో వచ్చేసాడు. 'కాటమరాయుడు' గురించి ఇప్పటిదాకా వినబడిన గాసిప్స్ అన్నిటికీ ఈ ఒక్క టీజర్ తోనే చెక్ పెట్టేసాడు పవన్. ఉన్న అనుమానాలన్నీ ఒక్క టీజర్ తో ఎగిరిపోయాయి. ఇప్పటిదాకా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇప్పుడు సైలెంట్ గా కుమ్మడానికి వచ్చేసాడు పవన్. డాలీ డైరెక్షన్ లో పవన్ నటిస్తున్న 'కాటమరాయుడు' లో అసలు పవన్ ఎలా ఉంటాడో అని అందరూ ఎదురు చూస్తున్న టైములో పంచెకట్టు తో ఫస్ట్ లుక్ వదిలి టీజర్ అతి త్వరలోనే అంటూ ఊరించిన చిత్ర యూనిట్ ఇప్పుడు పవన్ ని రాయుడు లుక్ లో ఫస్ట్ లుక్ టీజర్ లో చూపించి అరిపించేసారు.
ఇక 'కాటమరాయుడు' టీజర్ 'రాయుడో...' అంటూ బీట్ తో మొదలై పవన్ డాన్స్ తో పిచ్చేక్కిన్చేసి.... ఫైట్ సీన్ తో ఇరగదీసిన పవన్... 'ఎంత మంది వున్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడున్నాడన్నదే ముఖ్యం'.. డైలాగ్ తో టీజరే కాదు తన సత్తా ఏంటో చూపించాడు. అసలు పవన్ అలా పంచె కట్టుతో కూర్చునే సీన్ చూస్తుంటే మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు మిగతా ప్రేక్షకుడు కూడా కుర్చీలో నుండి లేచి ఈల వెయ్యడం గ్యారెంటీ అనిపించేలా ఉందా సీన్. ఇక పూర్తి యాక్షన్ తో నింపేశారు 'కాటమరాయుడు' టీజర్ మొత్తాన్ని. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అనూప్ రూబెన్స్ అరిపించేశాడు. అదరహో అనిపించేలా మ్యూజిక్ అందించాడని ఈ టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ప్రసాద్ మూరెళ్ళ కెమెరా..సినిమా ని ఓ లెవల్ కి తీసుకెళుతుందని చెప్పడానికి ఈ ఒక్క టీజర్ చాలు. ఇక ఈ టీజర్ లో హీరోయిన్ శృతి హాసన్ ని మాత్రం చూపించకుండా హైప్ క్రియేట్ చేశారు.
ఇంకొందరైతే ఒకడుగు ముందుకేసి..ఈ టీజర్ లోని డైలాగ్ పొలిటికల్ గా కూడా అన్వయిస్తున్నారు..'ప్రభుత్వంలో, ప్రతిపక్షంలో ఎంతమంది ఉన్నారు అన్నది ముఖ్యం కాదు...ప్రజల పక్షాన ఎవడున్నాడన్నది ముఖ్యం..'.
సో.. మొత్తానికి..పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' పై వున్న అంచనాలను ఈ టీజర్ అందుకున్నట్లే. ఇక మెగా ఫ్యాన్స్ కి ఈ టీజర్ పండగే.