Advertisementt

టాలీవుడ్‌ కన్ను వీటిపై కూడా పడింది..!

Sun 05th Feb 2017 12:41 PM
tamil hero,vijay,vijay 61 movie,director aantly,vijayandra prasad writter,samantha,director muragaadas  టాలీవుడ్‌ కన్ను వీటిపై  కూడా పడింది..!
టాలీవుడ్‌ కన్ను వీటిపై కూడా పడింది..!
Advertisement
Ads by CJ

తమిళస్టార్‌ విజయ్‌కి అక్కడ ఎలాంటి ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు కోలీవుడ్‌లో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేసే తాజా చిత్రంతో పాటు ఆయన తదుపరి చిత్రంపై కూడా కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ కూడా ఆసక్తిని చూపిస్తోంది. అట్లీకుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న 61వ చిత్రానికి ప్రస్తుతం ఎక్కడలేని క్రేజ్‌ వస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం తమిళనాడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. 

ఈ చిత్రానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ చిత్రాన్ని తెండ్రాల్‌ సంస్థ నిర్మిస్తోంది. ఆ సంస్థ నిర్మిస్తోన్న వందో చిత్రం ఇది. దీంతో దీనిని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడానికి ఆ సంస్థ సిద్దమై, ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇందులో విజయ్‌ సరసన సమంత, కాజల్‌, సీనియర్‌ హీరోయిన్‌ జ్యోతికలు నటిస్తున్నారు. ఆప్పటికే విజయ్‌ జ్యోతికతో 'ఖుషీ, తిరుమలై' వంటి హిట్‌ చిత్రాలు చేశాడు. ఇక కాజల్‌తో 'తుపాకి, జిల్లా' సినిమాలు చేశాడు. సమంతతో 'కత్తి, తేరి' చిత్రాలలో కలిసి పనిచేశాడు. ఇప్పడు ఈ ముగ్గురు హీరోయిన్లతో ఆయన ఈ చిత్రంలో కలిసి నటిస్తున్నాడు. దీనికి ఏకంగా ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందించేందుకు ఒప్పుకున్నాడు. 

కాగా ఈ చిత్రానికి టాలీవుడ్‌ సెన్సేషనల్‌ రైటర్‌, ముఖ్యంగా 'బాహుబలి, భజరంగీ భాయిజాన్‌'తో దేశంలోనే పాపులారిటీ సంపాదించిన విజయేంద్రప్రసాద్‌ కథ, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నాడు. ఇందులో సీనియర్‌ తమిళ స్టార్‌, కట్టప్పగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సత్యరాజ్‌, వడివేలు, సత్యన్‌ వంటి వారు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మరోపక్క ఈ చిత్రం తర్వాత విజయ్‌, మురుగదాస్‌ దర్శకత్వంలో హ్యాట్రిక్‌ మూవీ చేస్తున్నాడు. దీంతో ఈ చిత్రాల రీమేక్‌లపై టాలీవుడ్‌ నిర్మాతలే కాదు.. బాలీవుడ్‌ మేకర్స్‌ కూడా ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ