కామెడీ జోనర్ ఎంజాయ్ చేస్తూ, ఏడాదికి పాతిక, ముప్పై చిత్రాల్లో నటించిన కమేడియన్ సునీల్. హీరోగా మారాక గతంలో ఉన్న ఇమేజ్ పోయింది. హీరో అంటే సినిమా బరువంత తనే మోయాలి. అంతటి స్టామినా లేకపోయింది. దాంతో హీరోగా ప్రతికూల ఫలితాన్నేచూస్తున్నాడు. పైగా బడ్జెట్ పెంచేస్తున్నాడనే ఆరోపణలున్నాయి. సునీల్ హీరోగా మరో అటెమ్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ 'ఉంగరాల రాంబాబు'గా ప్రకటించారు. టైటిల్ చూస్తుంటే సరదాగా ఉంది. పైగా కామెడీ జోనర్ సినిమా అని స్పష్టమవుతోంది. సునీల్ కామెడీ హీరో అనే ముద్రతో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టు తాజా టైటిల్ స్పష్టం చేస్తోంది. గతంలో చలం అనే హీరో కమ్ కమేడియన్ ఉండేవారు. ఆయన కూడా ఇలాగే కామెడి హీరో అనే బ్రాండ్ తోనే ఆకట్టుకున్నాడు.కొన్ని సినిమాల్లో హీరోతో కలిసి కామెడీ పండించారు. హీరోగా నటించినపుడు కామెడి కథలనే ఎంపికచేసుకున్నారు. చలం నటించిన చిత్రాల్లో 'సంబరాల రాంబాబు' (1970) కూడా ఉంది.సునీల్ కొత్త సినిమా టైటిల్ దీనికి దగ్గరగా ఉంది. చలంను ఫాలో అయితే కనుక సునీల్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే సిని అభిమానుల్లో చలం చిరస్థాయిగా నిలిచారు. ఆ విధంగా సునీల్ సైతం హీరోగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.