అక్కినేని ఇంట కోడలుగా అడుగు పెట్టే శుభగడియల కోసం సమంత ఎదురుచూస్తోంది. ఇప్పటికే నాగచైతన్యతో నిశ్చితార్థం జరగడంతో దాదాపుగా ఆమెకు కోడలు హోదా వచ్చినట్టే. చైతుతో ఉంగరాలు మార్చుకుంది. హిందు సంప్రదాయం ప్రకారం మెడలో మూడు ముళ్ళు పడాలి.
నిశ్చితార్థం జరిగాక సమంత కొత్త సినిమాలకు సైన్ చేస్తోంది. రామ్ చరణ్ తో మైత్రి మూవీస్ లో చేయనుంది.తాజాగా మామ (నాగార్జున) నటిస్తున్న 'రాజుగారి గది 2'లో కూడా సమంత నటిస్తున్నట్టు తెలిసింది. ఇంతకు ముందు 'మనం'లో వీరిద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంటి కోడలితో మామ హోదాలో ఉన్న నాగార్జున నటిస్తుందడం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. 'రాజుగారి గది 2'లో సమంతది కీలక పాత్రని సమాచారం.
మామ కోడలు ఒకే సినిమాలో నటించడం కొత్తకాదు. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తనకోడలు ఐశ్వర్యరాయ్ తో కలిసి నటించారు. ఐశ్వర్య, అభిషేక్ ల వివాహం 2007లో జరిగింది. ఆ తర్వాత అమితాబ్ తో కలిసి ఐశ్వర్య 5 చిత్రాలల్లో నటించడం విశేషం. వీరిది కమర్షియల్ కాంబినేషన్ అని అంటారు. అలాగే నాగార్జున, సమంత కలిసి ఒకే సినిమాలో కీలక పాత్రలు పోషిస్తే ప్రేక్షాక అభిమానులు సంతోషిస్తారు. అమితాబ్ ను ఆదర్శంగా తీసుకుంటే ఒకే సినిమాలో మళ్లీ నాగార్జున, నాగచైతన్య, సమంత కాంబినేష్ కూడా చూడవచ్చు.