సమంత ఇప్పుడు నాగార్జున కోడలిగా ఆఫీషియల్ గా వాళ్ళింట్లో అడుగు పెట్టడానికి రెడీగా వుంది. ఇప్పటికే నిశ్చితార్ధం చేసుకుని అక్కినేని ఇంటికోడలు అనిపించుకున్న సమంత అటు నాగ చైతన్యతోనే కాక ఇటు మామగారైనా నాగార్జునతో కూడా ఇదివరకు ఒక సినిమాలో నటించింది. నాగార్జునతో అక్కినేని స్పెషల్ మల్టి స్టారర్ మూవీ 'మనం'లో నాగార్జునకి అమ్మగా నటించింది. అయితే మళ్ళీ ఇప్పుడు సమంత మరోమారు నాగార్జున కొత్త మూవీలో నటించున్నట్లు వార్తలొస్తున్నాయి. నాగార్జున కొత్త చిత్రం 'రాజుగారి గది 2' లో సమంత ఒక కేరెక్టర్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అసలు ఇప్పటికే సమంత ఆ మూవీలో నటించడానికి సైన్ కూడా చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఓంకార్ డైరెక్షన్లో వస్తున్న 'రాజుగారి గది 2' లో సమంత, నాగార్జునలిద్దరూ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక సమంతకి ఎంగేజ్మెంట్ అవడంతో అవకాశాలు మెల్లగా తలుపు తడుతున్నట్లు అర్ధమవుతుంది. నాగ చైతన్య తో ప్రేమ, పెళ్లి అన్నప్పటినుండి సమంతకి పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి టాలీవుడ్ లో. ఇక నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ అవడంతోనే రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రంలో సమంత ఎంపిక అవడం, ఇప్పుడు నాగార్జున 'రాజుగారి గది 2' లో సమంత నటించనుండడం చూస్తుంటే మళ్ళీ సమంత తొందరలోనే ఫామ్ లోకి వచ్చేస్తుందని అర్థమయిపోతుంది.