మహేష్, మురుగదాస్ కాంబినేషన్ లో చాలా కాలం నుండి ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు కొంత బ్రేక్ ఇచ్చి మహేష్ మలేషియా వెళ్లాడు. మహేష్ బాడీ డీటాక్సినేషన్ కోసం మలేషియా వెళ్ళాడని తెలుస్తున్న అంశం. కాగా అక్కడే మహేష్ సుమారు పది రోజుల వరకు గడపనున్నట్లు తాజా పరిస్థితులను బట్టి తెలుస్తుంది.
అసలు విషయం ఏంటంటే.. టాలీవుడ్ లో ప్రస్తుతం మహేష్ బాబు సమయం చాలా విలువైనదిగా గడుపుతున్నాడు. అలాంటి వాల్యుబుల్ కాలం మహేష్ కు నడుస్తుంది. అందుకనే మహేష్ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే ఏ మాత్రం తీరిక సమయం దొరికినా మరో సినిమాకు సంబంధించిన ప్లాన్లలోకి మహేష్ బాబు వెళ్తున్నాడు. అందులో భాగంగానే మహేష్ మలేషియాలో గడిపే పది రోజులను తన తర్వాత సినిమాకు దర్శకత్వం వహించే కొరటాల కోసం వెచ్చించినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ అంశం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మురుగదాస్ తో తీస్తున్న చిత్రం పూర్తయ్యాక వెంటనే మహేష్.. కొరటాలతో సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. అందుకనే ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ ను కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాడట కొరటాల. ఇక వీరిద్దరి కాంబినేష్ లో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్టు ఫైనల్ స్టేజీలో తుది రూపాన్ని సంతరించేందుకు మహేష్ తో కొరటాల మలేషియాకి పయనమయ్యాడని కూడా పరిశ్రమలో టాక్ నడుస్తుంది.
అంతే కాకుండా ఇంకా ఈ సినిమాకు మ్యూజిక్ ను అందించే దేవిశ్రీ ప్రసాద్ కి కూడా మలేషియాలో నుండి ఏ క్షణంలోనైనా పిలుపు రావచ్చని అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఒకవేళ దేవిశ్రీ ప్రసాద్ మలేషియా కాని వెళ్తే అక్కడే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరపవచ్చు. మొత్తానికి మహేష్ సమయాన్ని అస్సలు వృధా చేయడం లేదన్న మాట.