విభిన్నచిత్రాలలో నటిస్తూ, దేశ వ్యాప్తంగా పలు భాషలలో మంచి క్రేజ్‌ను, గుర్తింపును తెచ్చుకున్న వర్సటైల్ హీరో చాక్లెట్‌బోయ్ మాధవన్. సినిమా కథల విషయంలో ఆయన ఎంతో ఆచితూచి అడుగులు వేస్తాడు. వాస్తవానికి ఆయనకు కోలీవుడ్, టాలీవుడ్‌లతో పాటు బాలీవుడ్‌లో కూడా మంచి ఇమేజ్ ఉంది కానీ ఆయన దానిని క్యాష్ చేసుకోవాలని ఎప్పుడు ప్రయత్నించలేదు. కమల్‌హాసన్, విక్రమ్, అమీర్‌ఖాన్ వంటి వారి స్ఫూర్తితో ఆయన ప్రతి చిత్రాన్ని ఎంతో విభిన్నంగా, తన నటనతో వావ్.. అనిపించేలా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన నటించిన 'సఖి, యువ, త్రీ ఇడియట్స్' వంటి చిత్రాలలోని పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయనకున్న చాక్లెట్ బోయ్ ఇమేజ్‌కి యూత్‌లో, ముఖ్యంగా లేడీస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హీరో సిద్దార్ద్ కూడా తనకు స్ఫూర్తి మాధవన్ అని ఎన్నో సార్లు చెప్పాడు. ఇటీవల ఆయన నటించిన 'సాలా ఖద్దూస్'చిత్రం బాలీవుడ్, కోలీవుడ్‌లలో సంచలన విజయం సాధించింది. ఇదే చిత్రాన్ని తెలుగులోకి కూడా అనువాదం చేస్తారని పలువురు ఎదురుచూశారు. కానీ ఈచిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్ 'గురు' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా మాధవన్ సోషల్ మీడియాలో తన ఫొటోను షేర్ చేసూ.. కాస్త బరువు తగ్గాను అని తెలిపాడు. వాస్తవానికి ఆయన 'సాలా ఖద్దూస్'లో.. బాక్సింగ్‌లో రాజకీయాల వల్ల పెద్దగా ఎదగలేకపోయిన ఓ బాక్సర్ తన శిష్యురాలిని ఎలా ఛాంపియన్‌గా తీర్చిదిద్దాడు.. అనే పాత్రలో అదరగొట్టాడు. ఈ చిత్రం కోసం మిడిల్ ఏజ్‌డ్ బాక్సంగ్ కోచ్‌గా కనిపించేందుకు బాడీ షేప్‌లు మార్చి, కండలు పెంచాడు. కానీ ఆయన ఈ చిత్రం కోసం తాను పెరిగిన బరువును ఎలాంటి జిమ్‌లు, వర్కౌట్లు చేయకుండానే, కేవలం సింపుల్‌గా తన బరువును తగ్గించుకొని, ఇప్పటికీ చాక్లెట్‌బోయ్‌లా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ఆయన బరువు తగ్గడం కోసం కేవలం చిన్న చిన్న చిట్కాలనే పాటించానని వెల్లడించాడు. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏమి తినకపోవడం, ప్రతిసారి ఏదైనా తినే ముందు కనీసం ఐదారుగంటలు గ్యాప్ ఇవ్వడంతోనే తాను బరువును తగ్గానని ఆయన తెలిపాడు. ఈ విషయాన్ని ఒబేసిటీతో పాటు బరువు తగ్గడం కోసం నానా ప్రయత్నాలు చేసే వారు, హీరోహీరోయిన్లు పాటిస్తే బాగుంటుంది.. కదూ...!