నటునిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తూ వస్తున్న అప్‌కమింగ్ హీరో అడవి శేషు. ఇప్పటికీ ఆయన పూర్తి స్థాయి హీరోగా మారలేకపోయాడు. కానీ ఆయన పలు చిత్రాలలో నటిస్తూ.. ఆర్టిస్ట్‌గా బిజీగానే ఉన్నాడు. కొంతకాలం కిందట వచ్చిన లోబడ్టెట్ చిత్రం 'క్షణం' ఆయనకు మంచి విజయాన్ని అందించింది. పలు పెద్ద చిత్రాలలో కూడా అడవి శేషు కొన్ని పాత్రలు రావడం ఎక్కువైంది. తాజాగా 'జెంటిల్ మేన్' చిత్రంతో మరలా తన పూర్వవైభవం సాధించిన టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఓ చిత్రం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో అడవి శేషు...అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్‌లతో కలిసి నటిస్తున్నాడు. ఈ చిత్రం ఆయనకు మంచి బ్రేక్‌నిచ్చే అవకాశం ఉంది. దానికి కారణం.. గతంలో కూడా ఇంద్రగంటి పరిచయం చేసిన నాని వంటి వారు మంచి స్థాయికి వెళ్లారు. అలా ప్రారంభంలోనే ఆర్టిస్ట్‌లలోని ప్రతిభను గుర్తించే దర్శకునిగా ఇంద్రగంటికి మంచి పేరు వచ్చింది. కాబట్టి ఇంద్రగంటి అడవి శేషుకి ఆర్టిస్ట్‌గా మంచి కెరీర్‌ను ఇస్తాడనే అందరూ ఆశిస్తున్నారు.
తాజాగా అడవి శేషుకు మరో మంచి అవకాశం లభించింది. తమిళంలో ఘన విజయం సాధించిన 'చదరంగ వెట్టై' రీమేక్‌లో ఆయన స్థానం సంపాదించాడు. గతంలో మంచి మంచి చిత్రాలను, స్టార్స్ చిత్రాలను తీసినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయి... ఇంద్రగంటితో 'జెంటిల్ మేన్' తీసిన అభిరుచి కలిగిన నిర్మాత, శ్రీదేవి ఫిలిమ్స్ అధినేత అయిన శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో, అప్‌కమింగ్ ప్రొడక్షన్ సంస్థ అభిషేక్ బేనర్‌లో ఈ చిత్రం నిర్మితం కానుంది. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' విజయంలో కీలకపాత్ర పోషించి, తన నటనతో స్టార్‌హీరోల ప్రశంసలు కూడా పొందిన నందితాశ్వేత ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండటం మరో విశేషం. తమిళంలో యువదర్శకుడు వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, తెలుగులో సాయిరాం శంకర్ నటించిన 'రోమియో' చిత్రాన్ని డైరెక్ట్ చేసిన గోపీగణేష్ దర్శకత్వం వహించనున్నాడు. మరి ఈ చిత్రం అడవి శేషు, నందితాశ్వేతలతో పాటు డైరెక్టర్ గోపీగణేష్ కెరీర్‌కు, అగ్రనిర్మాణ సంస్థగా ఎదగాలని ప్రయత్నిస్తున్న అభిషేక్ ఫిలిమ్స్ సంస్థకు చాలా కీలకమనే చెప్పాలి. తమిళంలో ఆల్‌రెడీ ఘనవిజయం సాధించిన, ప్రూవ్‌డ్ సబ్జెక్ట్ కావడంతో, కాస్త మన ఆడియన్స్ అభిరుచుల మేరకు దర్శకుడు చిత్రీకరించగలిగితే ఈ చిత్రం మంచి విజయం సాధించే అవకాశాలున్నాయి. ఇలా అడవిశేషుకు ఇంద్రగంటి చిత్రంతో పాటు ఈ చిత్రం కూడా ప్రత్యేకం కానుంది.