Advertisementt

ప్రభుత్వం అంతు చూసే ఆలోచనలో ముద్రగడ!

Fri 03rd Feb 2017 05:30 PM
mudragada padmanabham,kaapu reservation,chandrababu,ap government  ప్రభుత్వం అంతు చూసే ఆలోచనలో ముద్రగడ!
ప్రభుత్వం అంతు చూసే ఆలోచనలో ముద్రగడ!
Advertisement

కాపులకు రిజర్వేషన్స్ కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న నాయకుడు ముద్రగడ పద్మనాభం. ఏపీ ప్రభుత్వం మాత్రం ఆయన ఉద్యమాన్ని ఎప్పుడు చేపట్టినా కానీ ఎక్కడికక్కడ అణచివేసేందుకు అంతే తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. అందుకు పలు సార్లు ఆయన ఉద్యమాన్ని, నిరాహార దీక్షలను చేస్తున్న ప్రతిసారీ కూడా ఏదో విధంగా పోలీసులు రంగ ప్రవేశం చేసి ముద్రగడను గృహ నిర్బంధం చేయ‌డం పరిపాటిగా మారింది. ఆ రకంగా తాజాగా ఆయన చేపట్టాలని భావించిన సత్యాగ్రహ పాదయాత్రకు కూడా పవన్ కళ్యాణ్ ను విశాఖ యువత నిరసనకు మద్దతుగా పురమాయించి ఆ ఆలోచనను డైవర్ట్ చేయడం కాకుండా ఆ విషయాన్నే డైల్యూట్ చేసేందుకు ప్రభుత్వం తెగ ప్రయత్నం చేసి దాన్ని మొత్తానికి దారి మళ్ళించిందనే చెప్పాలి.  ఆ రకంగా ప్రజలు కూడా ఆలోచన చేశారు. ఇంకా చెప్పాలంటే కాపుల కోసం ఉద్యమించేది ముద్రగడే కాదు ఇంకా ఉన్నారు అంటూ కాపుల్లోనే చీలికలు తెచ్చేందుకు కూడా ప్రభుత్వం తీవ్రంగా వ్యూహాలకు ప్రతి వ్యూహాలను పన్నుతుంది. ఈ రకంగానైనా ఉద్య‌మ తీవ్ర‌త‌ను త‌గ్గించేందుకు తెదేపా తగిన నివారణోపాయాల మీద దృష్టి పెట్టినట్లు కూడా తెలుస్తున్న అంశం. ఈ రకంగా ప్రభుత్వమే గోటితో పోయే అంశాన్ని గొట్టలి దాకా తెచ్చుకుంటుందన్న అంశం కూడా హాట్ టాపిక్ అయింది. పరోక్షంగా కాపు ఉద్యమాన్ని ప్రభుత్వమే బ‌లోపేతం చేస్తోంద‌న్న విమర్శలను కూడా మోస్తుంది.

అయితే తాజాగా ముద్రగడను గృహ నిర్బంధం చేయడంతో ఆయన ఈసారి ఉద్యమాన్ని జిల్లాల వారిగా చేయాలన్న విషయంపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. కాగా ముద్రగడ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప‌ర్య‌టించి, ఆయా నాయ‌కుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తున్న అంశం. ఈ రకంగా ముద్రగడ భవిష్యత్తులో తాను చేపట్టబోయే ఉద్యమం వ్యూహాత్మంకగా అంతా ఐక్యంగా, తన అధీనంలోనే జరిగేలా రాష్ట్రంలోని కాపులందరినీ గ్రిప్ లో పెట్టుకొనేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.

కాగా ముద్రగడ ఈ రకంగా కానీ చేస్తే ఏపీలో ఆయన కాపులకు తిరుగులేని నేతగా మారే అవకాశం లేకపోలేదు. పోయిన సంవత్సరం న‌వంబ‌ర్‌లో ముద్ర‌గ‌డ‌ను ప్రభుత్వం ఇరకాటంలో పెట్టి గృహ నిర్బంధం చేయగా అప్పుడు ఆయన కాపుల్లోని ప్రముఖ నేతలందరినీ కలిసి ఉద్యమానికి మద్దతు కోరిన విషయం తెలిసిందే. ఆ రకంగా ఇప్పటికే దాస‌రి నారాయ‌ణ‌రావు, చిరంజీవి వంటి నేతలను స్వయంగా కలిసి వారి వారి నైతిక మద్దతును తీసుకొన్నాడు ముద్రగడ. ఇక ఇప్పుడు జిల్లాల వారి మద్దతును కూడా కూడగట్టుకొని, ముద్రగడ తనకంటూ జిల్లాల వారి నేతలను ఏర్పరచుకుంటే మాత్రం కాపు ఉద్యమం ఇక కిర్లంపూడికే పరిమితం కాబోదు. ఒకవేళ ముద్ర‌గ‌డ‌ని కిర్లంపూడిలో పోలీసులు నిర్భందించినా ఆయన ఏర్పరచుకున్న వర్గం తాలూకూ నాయకులు మాత్రం జిల్లాల వారిగా చెలరేగి పోయి ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు తగిన వాతావరణాన్ని కల్పించుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు ముద్రగడ.  ఇలాగే కానీ ముద్రగడ చేస్తే అలా చేసుకోడానికి ప్రభుత్వమే స్వయంగా ఆయనకు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. ఇక ముద్రగడ ఉద్యమం ప్రభుత్వం చేతిలోంచి జారి ప్రజల చేతిల్లోకి పోయి తీవ్రస్థాయిలో జరిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి కాపు ఉద్యమాన్ని ప్రభుత్వం ఎంత అణచివేసినా ముద్రగడ మాత్రం అస్సలు తగ్గేదే లేదన్నట్టు వ్యూహాలకు ప్రతి వ్యూహాలను రచించుకొనే పనిలో నిమగ్నమయ్యాడు. చూద్దాం ముందు ముందు కాపుల ఉద్యమం ఎటువంటి పరిస్థితులను దారితీస్తుందో...!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement