Advertisementt

తరుణ్ బాల్, బ్యాట్ కే పరిమితమా..!

Fri 03rd Feb 2017 02:35 PM
tarun,tarun hero,cricket,tarun movies  తరుణ్ బాల్, బ్యాట్ కే పరిమితమా..!
తరుణ్ బాల్, బ్యాట్ కే పరిమితమా..!
Advertisement
Ads by CJ

మాజీ లవర్ బాయ్ తరుణ్ కు  (35) మళ్లీ పూర్వ వైభవం వచ్చే సూచనలు కనిపించడం లేదు. స్టార్ డమ్ అనుభవించి, మూస చిత్రాలు చేసి వెండితెర పిచ్ పై అర్థాంతరంగా ఇన్నింగ్ ముగించాడు. ఒకప్పుడు 20 ట్వంటీ ఆడిన తరుణ్ నిజజీవితంలో కూడా క్రికెటర్ గా మారాడు. సినీ తారల బెన్ ఫిట్ మ్యాచ్ అంటే తరుణ్ తప్పకుండా ఉంటాడు. బ్యాటింగ్ చేస్తాడు. బౌలింగ్ చేసి వికెట్లు పడగొడతాడు. తరుణ్ మీడియా ముందు కనిపించేది అప్పుడే. ఆ తర్వాత ఇంటికే పరిమితం. తరుణ్ హీరోగా కొంత గ్యాప్ తర్వాత మొదలైన 'ఇది నా లవ్ స్టోరీ' సినిమా ఆర్థిక సంక్షోభం కారణంగా ఆగిపోయింది. మరో కొత్త సినిమా లేదు. కేవలం తరుణ్ మాత్రమే కాదు. చాలా మంది యువ హీరోలు పెవీలియన్ పట్టారు. ఉజ్వలంగా ఉన్నపుడు కెరీర్ సరిగా ప్లాన్ చేసుకోక పోవడం వల్లే ఇలా జరిగిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తరుణ్ వయసు ఇప్పుడు 35 కావడంతో కుర్ర పాత్రలు చేసే అవకాశం లేదు. అలాగని క్యారెక్టర్ నటుడిగా మారినా లభించే ప్రోత్సహం తక్కువే. ఇంకా పెళ్ళి కాని తరుణ్ ఏదైన అద్భుతం జరుగుతుందని, తనకు సినిమాలు వస్తాయని ఆశతో ఉన్నాడు.