దర్శకుడు ఇంద్రకంటి కొత్త సినిమా మొదలైంది. నానితో 'జెంటిల్ మెన్' అనే హిట్ సినిమా తీశాడు. ఆ తర్వాత స్టార్స్ తో సినిమా చేద్దామని ప్లాన్ చేశాడు. కానీ ఎవరూ డేట్స్ ఇవ్వక పోవడంతో చివరికి అడవి శేషు, అవసరాల శ్రీనివాస్ కనిపించారు. వీరిద్దరిని కలిపి సినిమా మొదలెట్టేశాడు. శేషు, శ్రీనివాస్ వీరిద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులే. అయితే ప్రచారంలో మాత్రం 'మల్టీస్టారర్' సినిమా మొదలుపెట్టామని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. స్టార్స్ కు క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఉన్న తేడా కూడా దర్శకుడికి తెలియకపోవడం విచిత్రం. స్టార్ అంటే సొంత ఇమేజ్, సొంత మార్కెట్ ఉండాలి. భారీ ఓపనింగ్స్ తేగలిగే సత్తా ఉండాలి. వారినే స్టార్స్ అనడం పరిపాటి. అంతేకానీ ఇద్దరు హీరోలు నటించిన ప్రతి సినిమా మల్టీస్టారర్ అవదు. ఈ వ్యత్యాసం తెలుసుకోలేకపోయారు.
అడవిశేషు, అవసరాల శ్రీనివాస్ ఇద్దరు కూడా క్యారెక్టర్ నటులు. వీరికి హీరోగా ప్రమోషన్ వచ్చింది. దీనిని ఇద్దరు హీరోల సినిమా అని చెప్పుకోవాలి. అంతేకానీ 'మల్టీస్టారర్' అనే పెద్ద పెద్ద పదాలు వాడి, నిజమైన మల్టీస్టారర్ సినిమాలను గందరగోళ పరచకుంటే మంచిది.