తాను మెగాఫ్యామిలీ హీరోగా పరిచయమైన అతి తక్కువకాలంలోనే తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకుని, స్టార్‌హీరోగా ఎదుగుతున్నాడు మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్. కాగా ఫిబ్రవరి24వ తేదీన ఆయన నటించిన తాజా చిత్రం 'విన్నర్' విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం ఆయన కెరీర్‌కు ఎంతో కీలకంగా మారింది. 'తిక్క' చిత్రం డిజాస్టర్ తర్వాత ఆయన నటిస్తోన్న ఈ చిత్రం ఆయనకు ఎంతో ముఖ్యం. ఇక ఈ చిత్రాన్ని బడా నిర్మాతలైన నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధులు నిర్మిస్తుండటం, ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్, స్పెషల్ సాంగ్‌లో చేయనున్న అనసూయలు దీనికి ప్రత్యేక ఆకర్షణ.
గతంలో పవన్‌తో ఐటం చేయడానికి నిరాకంచిన అనసూయ ఈ చిత్రంలో సాయితో ఐటం చేయడానికి ఒప్పుకోవడం విశేషం, ఇక ఈ చిత్రానికి పాటిటివ్ బజ్ ఉండటం, ఆడియో కూడా బాగా వచ్చిందనే టాక్ నేపథ్యంలో ఈ చిత్రం అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రంలోని తొలిపాటను ప్రిన్స్ మహేష్‌బాబు విడుదల చేయడం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన కూతురైన 'సితార' పేరుతో మొదలయ్యే పాటను మహేష్ విడుదల చేయడం, ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుండటం విశేషం. ఈ మొదటి పాటను తమ అభిమాన హీరో మహేష్ విడుదల చేయడంతో ఈ మూవీ కోసం మహేష్ అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోపక్క ఆయన నటించే తాజా చిత్రం 'జవాన్' చిత్రం ప్రారంభోత్సవ వేడుకకు నందమూరి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ఎన్టీఆర్ అనీజీగా ఉండకుండా, ఎంతో ఆనందంగా కనిపించడాన్ని చూస్తే ఆయన ఎంతో ఇష్టపూర్వకంగా ఆ వేడుకకు వచ్చాడని అర్ధమవుతోంది. సాయి తాజాగా మంచు ఫ్యామిలీ హీరో మనోజ్ నటించిన 'గుంటూరోడు' ఆడియో వేడుకకు కూడా హాజరయ్యాడు. స్వయాన మంచు హీరో తాను, సాయి కలిసి 'బిల్లా... రంగా'కు సీక్వెల్ చేయాలని ఉందని ఆ వేడుకలో తన కోరికను వెలిబుచ్చాడు. ఇక ఆయన నటించిన 'విన్నర్' ఆడియో వేడుకను కూడా ఘనంగా చేయాలని సాయి నిర్మాతలను కోరుతున్నాడు. ఈ వేడుకకు చిరు, పవన్‌లతో పాటు బన్నీ, చరణ్, అల్లు అరవింద్ వంటి మెగాఫ్యామిలీ వారినందరినీ పిలవాలని ఒకే వేదికపై కూర్చొపెట్టాలనే పట్టుదలతో ఉన్నాడని తెలుస్తోంది.
ఇదే జరిగితే కేవలం తన మెగాఫ్యామిలీ అండదండలనే కాదు.. నందమూరి, మంచు ఫ్యామిలీలను, ఇక ఘట్టమనేని ఫ్యామిలీకి చెందిన సూపర్‌స్టార్ మహేష్‌బాబును, చివరికి అనసూయను కూడా సాయి ఒప్పించడాన్ని చూస్తున్న సినీ జనాలు ఆశ్చర్యచకితులవుతున్నారు. ఇగోలకు పోకుండా ఇతర స్టార్ హీరోలు, మిగిలిన టాలీవుడ్ ఫ్యామిలీల నుంచి కూడా ఆయనకు పాజిటివ్ టాక్ వస్తుండటం. ఆయన కోరిన వెంటనే ఆయనకు సపోర్ట్ చేయడానికి ముందుకొస్తున్న అందరి సహృదయాలను మెచ్చుకోవాల్సిందే, మరి వీరందరి రుణం సాయి ఎలా తీర్చుకోనున్నాడో వేచిచూడాల్సివుంది. మొత్తంగా ఈ మెగా మేనల్లుడు ఈ విషయంలో వరుణ్‌తేజ్‌తో పాటు మిగిలిన మెగా ఫ్యామిలీ హీరోల కంటే లౌక్యంగా వ్యవహరిస్తున్నాడనే చెప్పాలి.