ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ఒక్కటై పోరాడనున్నట్లు తెలుస్తుంది. ఆ దిశగా పోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. కాగా వీరిద్దరూ పోటాపోటీగా ఇప్పటివరకు వేరువేరుగా పోరాటం చేస్తున్న ఈ నేతలు ఇప్పుడూ ఒకే విషయంపై ఇద్దరూ కలిసి పోరాడితే ఏం జరగబోతుంది అన్న విషయం రాజకీయ వర్గాల్లో కలవరం రేగుతుంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే పవన్ కళ్యాణ్ తిరుపతి, కాకినాడ, అనంతపురం వంటి చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించి హోదా ద్వారా రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలను ప్రజలకు తెలుపుతూ ఆ దిశగా జనాలను చైతన్య పరుస్తున్న విషయం తెలిసిందే.
అయితే జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉంటూ కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. ఇప్పటివరకు వీరిద్దరూ కూడా ప్రజా సమస్యలు వీటిపై పోరాడారు. అంతా బాగానే ఉంది.. కానీ ఎవరితో పోరాడితే వీరి అసలు రంగు భయటపడుతుందో, ఎవరితో పెట్టుకుంటే వీరు ఉద్యమాన్ని ముందుకు నడపలేరో అనే భయంతోనే ఏమో గానీ ఇద్దరూ మరో ఇద్దరిని చూసి భయపడుతున్నట్లుగానే ఉందని ప్రజల్లో టాక్ నడుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాడు గానీ, అదే ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టిన చంద్రబాబుపై మాత్రం నోరెత్తి మాట్లాడటం లేదంటే పవన్, బాబును చూసి భయపడుతున్నాడా లేకా వారి మధ్య ఎలాంటి లావాదేవీలైనా నడుస్తున్నాయా అని ప్రజల్లో తీవ్రంగా టాక్ నడుస్తుంది. అలాంటిది ఏం లేకపోతే హోదా అక్కరలేదంటున్న తెదేపా అధినాయకుడు చంద్రబాబును పవన్ ఎందుకు విమర్శించడం లాంటివి చేయడం లేదని ఏపీ ప్రజల మెదళ్ళలో తొలుస్తున్న ప్రశ్నలు.
ఇక వైకాపా అధినేత జగన్ మాత్రం ఎంతవరకైనా చంద్రబాబుపైనే విమర్శల వర్షం కురిపిస్తాడు గానీ, మోడీని అస్సలు పట్టించుకోడనే టాక్ నడుస్తుంది. మోడితో పెట్టుకుంటే జగన్ మళ్ళీ జైల్లో ఊచలు లెక్క పెట్టుకోవాల్సి వస్తుందని జగన్ భయపడుతున్నాడని అందుకే కేంద్రంలో మోడీతో కాకుండా స్థానికంగా రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే పైర్ అవుతూ బాబుతోనే పోరాడం చేస్తున్నాడు. కాగా వీరిద్దరూ ఇప్పుడు కలిస్తే ఎవరిని ఎలా, ఎంతవరకు డీల్ చేసి ఉద్యమాన్ని ముందుకు నడుపుతారనేది అంతటా చర్చనీయాంశంగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో..