Advertisementt

ఉగ్రవాదాన్ని నివారించలేమా...?

Thu 02nd Feb 2017 04:58 PM
naxalism,isis,muslims isis,pakistan,nepal,jammukashmir,terrorist leaders  ఉగ్రవాదాన్ని నివారించలేమా...?
ఉగ్రవాదాన్ని నివారించలేమా...?
Advertisement

ఉగ్రవాదానికి కొందరు పాల్పడినంత మాత్రాన ఆ మతం వారందరూ అలాంటివారు అని తేల్చడం కూడా తప్పే. కానీ ప్రస్తుతం ప్రపంచంలో ఇస్లామిక్‌ ఉగ్రవాదం మాత్రం పెరిగిపోతోందన్నది నగ్నసత్యం. దీనికి ముస్లిలందరినీ బాధ్యులం చేయలేం.కానీ లౌకిక భావాలు, దేశభక్తి, మత చాందసవాదాలకు వ్యతిరేకంగా ఉన్న ముస్లింలు, వారి సంస్థలు, ప్రజాప్రతినిధులు పెద్దగా స్పందింకపోవడం, మౌనం వహిస్తుండటం కూడా తప్పే. ఇక ముస్లిం దేశాలపై తాజాగా ట్రంప్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై ప్రపంచవ్యాప్తంగానే కాకుండా అమెరికాలో కూడా తీవ్ర నిరసనలు వినిపిస్తున్నాయి. 

ప్రజాస్వామ్యయుతంగా, హింసకు తావులేకుండా నిరసనలు తెలపడాన్ని ఎవ్వరూ తప్పుపట్టకూడదు. కానీ ఇక్కడ కొందరు శరణార్ధుల రూపంలో విదేశాలకు వెళ్లి అక్కడ హింసాత్మకచర్యలకు పాల్పడుతుండటం కూడా నిజమే. ఎంతమంది ఇస్లామిక్‌ ఉగ్రవాదులు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ వంటి దేశాల గుండా భారత్‌లోకి ప్రవేశించి, ఉగ్రవాదానికి ఊతమివ్వడం లేదు. ఇక జమ్మూకాశ్మీర్‌లో అక్కడి పండిట్‌లను రాష్ట్రం నుంచి కూడా వెళ్లగొడుతున్నారు. వారిని టార్గెట్‌ చేస్తున్నారు. ఇక ఆ రాష్ట్రాంలో ఇతరులు భూములు కూడా కొనకూడదనే స్పెషల్‌ ఆర్టికల్‌పై గతంలో బిజెపి, ఆరెస్సెస్‌తో పాటు పలు హిందు సంస్థలు తీవ్ర స్వరం వినిపించాయి. 

కానీ ప్రస్తుతం పూర్తి మెజార్టీ ఉన్న బిజెపి ప్రభుత్వం కూడా ఆ ఆర్టికల్‌ను ఇప్పటివరకు తొలగించలేదు. ఇక హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు, ముంబై వంటి చోట్ల కూడా పలువురు ఇస్లామిక్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ, పలు ప్రలోభాలకు లొంగుతున్నది నిజం కాదా? మరి వారిపై కఠినచర్యలు తీసుకోవడంలో మన ప్రభుత్వాలు, రాజకీయపార్టీలు, మతాల ప్రతినిధులు, నాయకులు ఎందుకు చిత్తశుద్దితో ప్రయత్నించడం లేదు..? భవిష్యత్తులోనైనా బిజెపిలోని మోదీ వంటి దృడనాయకులు ఈ దిశగా ముందడుగు వేస్తారని ఎంతో మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. 

ఆర్థికంగా అలాంటి శత్రువులకు అండదండలు అందించకుండా నోట్ల రద్దు వంటి సర్జికల్‌ ఆపరేషన్స్‌ను తీవ్రతరం చేయాల్సివుంది. ఇక యువత ఎక్కువగా ఉగ్రవాదం, నక్సలిజం వైపు మొగ్గు చూపడానికి, డబ్బుల కోసం ఇలా సంఘవిద్రోహులుగా మారడానికి నిరక్షరాస్యత, ప్రజలను సరిగా చైతన్యవంతులను చేయకపోవడం, మరీ ముఖ్యంగా నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు లేకపోవడం, చాలా మంది ఇంకా ఆర్ధికంగా దుర్భరపరిస్థితులను అనుభవిస్తుండటం, ఓట్ల రాజకీయాలు వంటివి కూడా ప్రధాన కారణమే. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వాలు, రాజకీయనాయకులు ఇప్పటికైనా మారాల్సివుంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement