Advertisementt

లోకలోడి కోసం శర్వానంద్ బలి...!

Wed 01st Feb 2017 03:21 PM
sharwanand,dil raj,nani,nenu local,shatamanam bhavathi  లోకలోడి కోసం శర్వానంద్ బలి...!
లోకలోడి కోసం శర్వానంద్ బలి...!
Advertisement
Ads by CJ

సినిమా బావుందన్నాడు. కలెక్షన్లు వస్తున్నాయన్నాడు. సంతోషంగా సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఇప్పుడేమో థియేటర్ల నుండి ఎత్తేస్తున్నాడు. ఇదంతా దిల్ రాజు 'శతమానం భవతి' గురించి టాలీవుడ్ లో వినిపిస్తున్నమాట. రెండు భారీ సినిమాల నడుమ వచ్చి కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రాన్ని చాలా థియేటర్లలో గురువారం ఎత్తేస్తున్నారు.ఈ థియేటర్లను దిల్ రాజు నిర్మించిన 'నేను లోకల్' సినిమాకు కన్ ఫర్మ్ చేశారు. అంటే లోకలోడి కోసం శర్వానంద్ సినిమాను బలి చేస్తున్నారన్నమాట. ఈ రెండు సినిమాలకు కూడా దిల్ రాజు నిర్మాత, పంపిణిదారుడు విశేషం.   సంక్రాతి రేసులో వచ్చి నిలదొక్కుకున్న శర్వానంద్  ఈ పరిణామం పట్ల ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. ఐదు వారాలు సునాయసంగా ఆడే ఆవకాశం ఉన్నప్పటికీ నాని సినిమా కోసం  తీసివేస్తుండడం  పట్ల శర్వానంద్ సన్నిహితులు సైతం ఆగ్రహంతో ఉన్నారు. వేరే ఇతర సినిమాల కోసం థియేటర్లు ఇవ్వడానికి మోకాలడ్డే దిల్ రాజు తన సినిమా వరకు వచ్చే సరికి మాత్రం రూల్స్ గుర్తుకురాలేదు.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ