Advertisementt

ప్రచారం కోసం సన్మానాలు..!

Wed 01st Feb 2017 01:16 PM
t,subbarami reddy,chiranjeevi,balakrishna,krish,khaidi no 150,gautamiputra satakarni  ప్రచారం కోసం సన్మానాలు..!
ప్రచారం కోసం సన్మానాలు..!
Advertisement
Ads by CJ

కళాబంధు అనగానే టి.సుబ్బరామిరెడ్డి గుర్తుకువస్తారు. కొద్ది సంవత్సారాల క్రితం ఆయన సినిమా స్టార్స్ కు సత్కారం చేస్తూ పాపులర్ అయ్యారు. ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకుంటారు. మధ్యలో రాజకీయంగా బిజీగా ఉన్న కారణంగా వీటికి గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చతికిల పడడంతో తన పాపులారిటీ పెంచుకునేందుకు పాత దుకాణం మళ్ళీ తెరిచారు. సొంత హోటల్ ఉంది కాబట్టి తను శాలువ కప్పి, బొకే అందించాల్సిన వారిని అక్కడికే పిలుస్తారు. మీడియాకు మాత్రం నో ఎంట్రీ. ఇంకా అందుబాటులో ఉన్న సినీ సెలబ్రిటీలను కూడా రమ్మంటారు. ఇంకేం తూ తూ మంత్రంగా సత్కారం చేసి, ఆ ఫోటోలను మీడియాకు పంపిస్తారు. దాంతో ఉచిత ప్రచారం లభిస్తుంది. తాజాగా ఇలాంటి లిమిటెడ్ సత్కారాలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. చిరంజీవి అండ్ కో, బాలకృష్ణ అండ్ కో కు ఈ విధంగానే చేశారు. నిజానికి సత్కారమంటే ప్రేక్షకుల నడుమ చేయాలి. కానీ టిఎస్ ఆర్ మాత్రం చడిచప్పుడు లేకుండా చేసి, సదరు సెలబ్రిటీలను పొగడ్తల్లో ముంచేస్తున్నారు.

గతంలో కూడా ఊరు వాడలో సత్కార సభలు జరిపారు. ఖైదీ సినిమా ప్రీ రిలీజ్ కు ఎలాంటి హోదా లేకుండానే హాజరయ్యారు.  తన పుట్టినరోజున వైజాగ్ లో మోహన్ బాబును సన్మానించారు. ఇలా ఒక లిస్ట్ పెట్టుకుని వరుస కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక ఆయన పేరుతో మరిన్ని అవార్డులు కూడా ఉన్నాయి. వాటికి కూడా త్వరలో తెరతీసే ప్రయత్నం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమతో ఉన్న పూర్వ పరిచయాలు పునరుద్దరించుకోవడం మినహా టిఎస్ఆర్ చేస్తున్న ఇలాంటి సత్కారాల వల్ల ప్రజలకు ఎలాంటి మేలు లేదనే విమర్శలున్నాయి. మీడియా కూడా వీటికి ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండాల్సిందని పలువురు భావిస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ