Advertisementt

రవితేజ ఫ్యామిలీ ఫోటో సంచలనం..!

Wed 01st Feb 2017 12:52 PM
raviteja,raviteja family photo,mass raja raviteja family,raviteja family photo sensation  రవితేజ ఫ్యామిలీ ఫోటో సంచలనం..!
రవితేజ ఫ్యామిలీ ఫోటో సంచలనం..!
Advertisement
Ads by CJ

హీరోగా రవితేజ తన స్వశక్తితో పైకి వచ్చాడు. లేటు వయసులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ మొదట్లో చిన్నా చితక కేరెక్టర్స్ వేసుకుంటూ కాలం గడుపుతూ....  హీరోగా మారాడు. ఇక ఎనర్జిటిక్ పర్సన్ గా.... అజాత శత్రువుగా పేరుపొందాడు.  గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేకుండా మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగాడు. ఇక రవితేజ తమ్ముళ్లు సినిమాల్లో ట్రై చేసి నిలదొక్కుకోలేక డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుని జీవితంలో చాలా నష్టపోయారు. అయితే రవితేజ ఎక్కడా తన ఫ్యామిలీని మీడియాకి దొరకనివ్వలేదు. రవితేజ ఇండస్ట్రీలో ఏ ఫంక్షన్ కి హాజరయిన కూడా ఎప్పుడూ తన ఫ్యామిలీతో అటెండ్ అయ్యేవాడు కాదు. కొంతమంది అలాగే వుంటారు పెద్దగా మీడియా కి తమ పర్సనల్ విషయాలు తెలియకుండా జాగ్రత్తపడతారు. రవితేజ కూడా అంతే. ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నా... లేక ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ కి హాజరైనా కూడా తన ఫ్యామిలీని ఎప్పుడు నలుగురిలోకి తీసుకువచ్చేవాడు కాదు. అయితే ఈ మధ్యన రవితేజ సినిమాలకు కూడా చాలా గ్యాప్ ఇచ్చేసి ఖాళీగా ఉంటున్నాడు. అయితే రవితేజ తన బర్త్ డే సందర్భంగా రెండు సినిమాలను లైన్ లో పెట్టి హడావిడి చేసాడు. ఇక తాజాగా తన కూతురు, కొడుకు, భార్యతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇప్పుడు రవితేజ పోస్ట్ చేసిన పిక్ సోషల్ మీడియాలో రవితేజ ఫ్యామిలీ ఫస్ట్ సెల్ఫీ అంటూ నానా హంగామా సృష్టిస్తోంది. ఆ పిక్ ఇదే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ