తాజాగా తన చిన్న కుమారుడు మంచు మనోజ్ నటించిన 'గుంటూరోడు' ఆడియో వేడుకలో ఆయన తండ్రి మంచు మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు కాస్త దుమారాన్నేరేేపాయి. ఆయన తాననుకున్నది కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంలో ముందుంటారనేది కూడా వాస్తవమే. తాజాగా ఈ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, 'ఒకప్పుడు ఓ చిత్రంలో నటించిన హీరో, హీరోయిన్లు బాగా నటిస్తే,... వారి జంట చూడముచ్చటగా ఉందని, ఇద్దరు చాలా బాగా నటించేవారని అనేవారు. కానీ నేడు అందరూ హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాలు బాగుంటే ఇద్దరి మద్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందంటున్నారు. ఈ కెమిస్ట్రీ అనే పదం నాకు అస్సలు నచ్చదు.
మరి ఇలా ఎందుకు అంటున్నారో? ఎందుకలా రాస్తున్నారో? అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆయన ఆవేదన అర్ధం చేసుకోగలిగిందే అయినా... నాటి చిత్రాలలో అసభ్యతకు తావు లేకుండానే హీరో హీరోయిన్లు తమ హావభావలతోనే రొమాన్స్‌ను, విరహ వేదనను, శృంగార భావాలను ప్రకటించేవారు. అందుకు హీరో హీరోయిన్లు , దర్శకులు, నిర్మాతలు, ప్రేక్షకులు అందరూ సహకరించేవారు. కానీ నేటి రోజుల్లో రొమాన్స్ అంటే అర్థం మారిపోయింది. డబుల్‌మీనింగ్‌లు, రెచ్చిపోయి నటించే హాట్‌సీన్స్, పొట్టి దుస్తులతో, అసలు గుడ్డలే లేకుండా తమ కోరికలను వెల్లడిస్తున్నారు.చిరంజీవి నుంచి మీ వరకు ఎవ్వరూ దీనికి మినహాయింపు కాదు. చిరు తన 'స్టాలిన్' చిత్రంలో త్రిషతో బ్రాలు, అండర్ వేర్స్ గురించి మాట్లాడుతాడు. ఇప్పటికీ చిన్న చిన్న హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ వస్తున్నాడు. ఇక మీరు నటించిన చిత్రాలలో, ముఖ్యంగా 'పొలిటికల్ రౌడీ' చిత్రంలో చార్మికు, మీకు మద్య వచ్చే సీన్స్ ఎలా ఉన్నాయో ఆలోచించండి.
ఇక సినిమాలో అద్భుతమైన డైలాగ్‌డెలివరీతో ఆకట్టుకునే మీరు కూడా కొన్ని చిత్రాలలో మోటు డైలాగులు చెప్పిన విషయం గుర్తులేదా? ఇప్పుడు మీ కొడుకులే కాదు.. అందరు హీరోలు అలాగే తయ్యారయ్యారు.. కాబట్టే... జంట బాగుంది..... అంటే ఎవరైనా అలా రాసినవాడిని చూసి నవ్విపోతారు. అందుకే పేరు మార్చి కెమిస్ట్రీ అంటున్నారు.. ఇది కాలానుగుణమైన మార్పే కానీ ఎవ్వరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్న పనికాదు.. కాబట్టి అలాంటి విషయాలను చూసి చూడనట్లు ఉండాలే గానీ.. ఈ రోజుల్లో నీతులు ఎవ్వరికీ అక్కర్లేని దరిద్రపు భావజాలం మాట్లాడుకోవడం కంటే.. ఎవరి సంగతి వారు చూసుకుంటే సరిపోతుంది. ముందుగా మీ కుమారుడు నటించిన 'ఆడో రకం.. వీడో రకం...' తాజాగా మీరు ఆవిష్కరించిన 'గుంటూరోడు' చిత్రం ట్రైలర్‌లో హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ అందాల ప్రదర్శన చూసి మాట్లాడటం మంచిదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దయ చేసి గమనించగలరు...!