Advertisementt

డైరెక్టర్‌ ఎవరో హింట్‌ ఇచ్చిన బండ్ల....!

Wed 01st Feb 2017 11:21 AM
bandla ganesh,srinuvaitla,krishna vamsi,harris shankar,puri jagannadh  డైరెక్టర్‌ ఎవరో హింట్‌ ఇచ్చిన బండ్ల....!
డైరెక్టర్‌ ఎవరో హింట్‌ ఇచ్చిన బండ్ల....!
Advertisement
Ads by CJ

ఇటీవల వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో కమెడియన్‌ నుండి అగ్రనిర్మాతగా మారిన బండ్ల గణేష్‌ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల ఆయన తాను ఓ డైరెక్టర్‌గా పనిచేయడం తప్పయిపోయిందని, మందు కొట్టడం, డ్రగ్స్‌ వాడటం తప్ప వాడికేమీ రాదంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆయన చేసిన దర్శకుల్లో ఎవరా దర్శకుడు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. తాజాగా ఈ విషయంలో బండ్ల ఓ పెద్ద హింటే ఇచ్చాడు. తాను ఓ దర్శకునితో పనిచేయడం తన ఖర్మ అని మరోసారి తెలిపాడు. తనకు నచ్చిన ఫేవరేట్‌ దర్శకుడు పూరీజగన్నాథ్‌ అని తేల్చేశాడు. ఇక హరీష్‌శంకర్‌, శ్రీనువైట్లలకు హిట్‌ సినిమా తీయాలనే కోరిక బలమని, అందు కోసం వారు విపరీతంగా కష్టపడుతారని పేర్కొన్నాడు.

మరోవైపు తాను విమర్శించిన దర్శకుడి గురించి మాట్లాడుతూ, ఒక సారి చెప్పిన కథను మరోసారి చెప్పలేడు.. లోకేషన్‌లో ఏమనుకుంటే అది తీసేస్తూ ఉంటాడు. ఆయననేమీ నేను పరిచయం చేయలేదు. అప్పటికే ఆయన పాపులర్‌ డైరెక్టర్‌ అని తెలిపాడు. రాత్రయితే ఏ మందు తాగుదామా? ఏడ్రగ్స్‌ వాడుదామా? అనే ఆలోచన తప్పితే మరో ఆలోచన అతనికి లేదన్నాడు. ఏవో నాలుగైదు సీన్లు బాగా తీసినంత మాత్రాన గొప్ప క్రియేటర్‌ అయిపోతాడా? సమయానికి తీసేవాడే నిజమైన డైరెక్టర్ అని వ్యాఖ్యానించాడు. ఆయనతో సినిమా చేసేటప్పుడు ఏడుపొచ్చిందని, కానీ తాను ఆయన పేరు చెప్పి, ఆయన కడుపుకొట్టనని చెప్పాడు. మరోవైపు తనను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రామ్‌చరణ్‌ ఎంతో ఆదుకున్నాడని తెలిపాడు. ఇప్పటివరకు బండ్లగణేష్‌ పరుశురాం, హరీష్‌శంకర్‌, జయంత్‌ సి.పరాన్జీ, శ్రీనువైట్ల, పూరీజగన్నాత్‌, కృష్ణవంశీ వంటి వారితో చిత్రాలు నిర్మించాడు. మరి ఇప్పటికైనా అందరికి ఆ డైరెక్టర్‌ ఎవరో అర్ధమైపోయి వుంటుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ